
Harish Rao | తొగుట : తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత తన్నీరు హరీశ్ రావు కారణ జన్ముడని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. హరీశ్ రావు జన్మదినోత్సవం పురస్కరించుకొని తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో వనం చెరువు వద్ద గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్‌తో కలిసి బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించి, కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమ జ్వాలను గ్రామగ్రామానికీ చేర్చిన నాయకుడు హరీశ్ రావు అని కొనియాడారు. ఉద్యమ దశలోనూ, రాష్ట్రసాధన అనంతరం పాలనా దశలోనూ ప్రజల మధ్యే ఉంటూ తెలంగాణ అభివృద్ధికి విశేష సేవలందించిన నేతగా ఆయన గుర్తింపు పొందారని పేర్కొన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించి గ్రామీణ వ్యవసాయానికి జీవం పోశారని, పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించారని అన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బస్తీ దవాఖానాల ఏర్పాటు, వైద్య సేవల విస్తరణ ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. “ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచే నాయకులు అరుదు. అలాంటి ప్రజానాయకుడు హరీశ్ రావని, . తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్య, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Small Habits | రోజువారీ జీవితంలో చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇవే.. వీటిని చేయకూడదు.. Nallagonda | డీసీఎంను ఢీ కొట్టిన మినీ ట్రావెల్ బస్సు..ఒకరు మృతి, 13 మందికి గాయాలు Rayapol | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో..భారీగా ట్రాఫిక్ జామ్ # 8-2-603/1/7,8&9, Krishnapuram, Road No. 10, Banjara Hills, Telangana - 500034. Phone: +91 40 2329 1999 Website: +91-40-23291163 digitalsales@tppl.news The content of this site is © 2026 Telangana Publications pvt. Ltd Harish Rao | తొగుట : తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత తన్నీరు హరీశ్ రావు కారణ జన్ముడని బీఆర్ఎస్ పార్టీ తొగుట...