
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. APSRTC Privatisation News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయనే ఆందోళనల నడుమ ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ప్రైవేట్ సంస్థల ద్వారా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మికులు ఏకమవుతున్నారు. దీనిపై చర్చించేందుకు జూన్ 8న విజయవాడలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే.. 1) ప్రైవేట్ సంస్థల ద్వారా విద్యుత్ బస్సులను నడిపించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. 2) ఈ-బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అందుకుని, ఆర్టీసీ సిబ్బందితోనే సొంతంగా వాటిని నిర్వహించాలి. 3) లీజుల పేరుతో విలువైన ఆర్టీసీ డిపోల స్థలాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను వెంటనే అడ్డుకోవాలి. జూన్ 8న 'జేఏసీ' ఏర్పాటు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకముందు ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించాయి. దీని కోసం 'ఏపీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ' (JAC) ఏర్పాటు కానుంది. జూన్ 8న విజయవాడలో జరిగే ఈ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ ప్రైవేటీకరణ వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. "దశాబ్దాలుగా ప్రభుత్వ రంగ సంస్థగా లక్షలాది మంది ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీని మరింత బలోపేతం చేయాల్సింది పోయి, ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది." అని ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ ఆసోసియేట్ అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు సంయుక్తంగా ప్రకటించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు, ప్రస్తుతం అమలులో ఉన్న 'స్త్రీ-శక్తి' (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకం వల్ల క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించనున్నారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ఆర్-పార్ పోరాటానికి సిద్ధమవుతుండటంతో ఈ జూన్ 8 భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. Also Read: వైజాగ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..బాత్రూమ్లో భయంకరమైన చప్పుళ్లు..కమోడ్ తెరిచి చూస్తే Also Read: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి...