
Bajaj Avenger 220 Street: బజాజ్ నుంచి సరికొత్త బైక్ వచ్చేసింది. బజాజ్ ఆటో భారత మార్కెట్లో వినియోగదారుల కోసం అవెంజర్ స్ట్రీట్ 220 అప్డేట్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా అందిస్తుంది. ప్రత్యేకించి సిటీ డ్రైవింగ్ కోసం క్రూయిజర్-స్టయిల్ బైక్ అందిస్తోంది. స్ట్రీట్ 160 ప్రొడక్టు నిలిపివేయడంతో ఈ బైక్ ఇప్పుడు కంపెనీ లైనప్‌లో కీలక మోడల్‌గా మారింది. అప్డేటెడ్ బైక్ ఇప్పుడు బ్రాండ్ అధికారిక వెబ్సైట్లో లిస్టు అయింది. ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉంది. పూర్తి వివరాలివే.. కొత్త మోడల్ ఏడాదికి బజాజ్ అవెంజర్ 220 బైకు ఎబోనీ బ్లాక్ కాక్టెయిల్ రెడ్ వైన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇతర డిజైన్ మారలేదు. సౌకర్యవంతమైన రైడింగ్ కోసం ఎత్తైన హ్యాండిల్‌బార్ ఫ్రంట్ ఫుట్‌పెగ్‌లతో ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ రిలాక్స్డ్ డిజైన్ అందిస్తుంది. ఇందులో రౌండ్ షేప్ హెడ్‌ల్యాంప్ ఫ్యూయల్ గేజ్‌తో పాటు ఫ్యూయిల్ ట్యాంక్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంజిన్, ఫీచర్లు : బజాజ్ పల్సర్ 220Fకి పవర్ అందించే అదే 220cc, ఎయిర్-ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 8,500rpm వద్ద 19hp పవర్, 7,000rpm వద్ద 17Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ పవర్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ స్పీడ్ అందిస్తుంది. Read Also : Motorola Edge 70 Pro Plus : మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..! ఈ బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, 5-స్టెప్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్తో ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం 280mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ 130mm రియర్ డ్రమ్ బ్రేక్‌ను అమర్చారు. సేఫ్టీ కోసం ఈ బైక్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది. అవెంజర్ 220 స్ట్రీట్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 90/90-17 బ్యాక్ సైడ్ 130/90-15 సైజులో ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చి ఉంటాయి. అవెంజర్ క్రూజ్‌లో స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్లు ఉంటాయి. అయితే, స్ట్రీట్ వేరియంట్ ట్యూబ్‌లెస్ కారణంగా పంక్చర్ రిపేర్లు చాలా ఈజీ అవుతాయి. ఈ బైక్‌లో 13-లీటర్ల ఫ్యూయిల్ ట్యాంక్ ఉండగా, మొత్తం 160 కేజీల బరువు ఉంటుంది. 737 మిమీ సీటు ఎత్తుతో రైడర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. Telugu » Business » Bajaj Launches The New Avenger 220 Street 220cc Power Meets Classic Cruiser Design 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Bajaj Avenger 220 Street: బజాజ్ నుంచి సరికొత్త బైక్ వచ్చేసింది. బజాజ్ ఆటో భారత మార్కెట్లో వినియోగదారుల కోసం అవెంజర్ స్ట్రీట్ 220 అప్డేట్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 1.30...