
Peddi First Review : రామ్ చరణ్ పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రేపు జూన్ 4న పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా నేడు రాత్రే ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే ఇప్పటికే పలువురు బయ్యర్లు, సినీ పరిశ్రమ వ్యక్తులు, ఓవర్సీస్ లో కొంతమంది ఈ సినిమా చూసేసారు. దీంతో పెద్ది సినిమా టాక్ వినిపిస్తుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ నిర్మాణంలో బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జగపతి బాబు, శివన్న, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ.. పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, మాస్ ఎలిమెంట్స్ తో, కామెడీతో, జాన్వీ కపూర్ అందాలతో సాగుతుందని సమాచారం. ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త నిదానంగా ఎమోషనల్ గా సాగుతుందట. మళ్ళీ క్లైమాక్స్ ఉత్కంఠభరితంగా రన్నింగ్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. Also Read : Michael OTT: ఓటీటీకి వచ్చేస్తున్న గ్లోబల్ బ్లాక్ బస్టర్ ‘మైఖేల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే? కథ విషయానికొస్తే.. విజయనగరం దగ్గర ఓ కొండ దగ్గర్లో ఉండే పల్లెటూరు నుంచి పెద్ది, అతని మనుషులు వస్తారు. వీళ్లంతా ఆటల్లో బెస్ట్ అవ్వడంతో కొంతమంది వీళ్ళను ఆట కూలీలుగా పెట్టి గేమ్స్ నిర్వహిస్తూ డబ్బులు చేసుకుంటారు. వీళ్ళు పొట్టకూటి కోసం ఆ ఆటలు ప్రాణాలు తెగించి ఆడతారు. హీరో ఎంట్రీ క్రికెట్ గేమ్ తోనే ఉంటుందని, క్రికెట్ ఆడుతూనే ఫైట్ చేస్తాడని తెలుస్తుంది. తన మనుషుల్లో ఒకరు చనిపోవడం, తన ఊరికి గుర్తింపు రాకపోవడం, వీళ్ళపై కొంతమంది వివక్ష చూపించడంతో ఆట కూలిగా క్రికెట్, కుస్తీ ఆడే పెద్ది ఎదురుతిరుగుతాడని ఆ సీన్ తో ఇంటర్వెల్ ఉంటుందని టాక్. తమ ఊరి కోసం, తమ మనుషుల కోసం పెద్ది ఢిల్లీ వెళ్తాడని, సెకండ్ హాఫ్ అంతా ఢిల్లీలోనే జరుగుతుందట. ఢిల్లీలో పలు రాజకీయ నాయకులను కలవడానికి పెద్ది ట్రై చేస్తాడని, అయినా ఫలితం ఉండదు అని సమాచారం. దాంతో సెకండ్ హాఫ్ అయితే ఎక్కువ ఎమోషనల్ గా సాగదీశారట. క్లైమాక్స్ లో మళ్ళీ రన్నింగ్ సీన్స్ తో గూస్ బంప్స్ తెప్పిస్తారట. ఇక జాన్వీ కపూర్ యాక్టింగ్ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపిస్తుందట. అక్కర్లేకపోయినా ఆమెతో అందాలు ఆరబోయించారు. స్క్రీన్ ప్లే కూడా ఎలాంటి ట్విస్టులు లేకుండా సింపుల్ గా, రెగ్యులర్గా ఉందట. ఒకటి రెండు కామెడీ సీన్స్ జాన్వీతో ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదట. ఈ సినిమాకు చరణ్ పర్ఫార్మెన్స్, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ సీన్స్ ప్రాణం పోశాయి. జగపతి బాబు అప్పల సూరి పాత్ర సినిమాకే హైలెట్. ఆయన తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారట. బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ మాత్రం పర్వాలేదనిపించాడట. Also Read : Sundeep Kishan: జాసన్ సంజయ్ కూడా అచ్చు విజయ్ లాగే.. సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా పెద్ద హిట్ అయినట్టే అంటున్నారు టాలీవుడ్ జనాలు. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్తున్నారు. విజువల్స్ పరంగా పెద్ది హై లెవల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసారంట. సినిమాపై ఖర్చు మాత్రం బాగానే పెట్టినట్టు ప్రతి సీన్ లో కనిపిస్తుందట. మొత్తానికి రామ్ చరణ్ పెద్ది సినిమా ఫ్యాన్స్ అయితే మెప్పిస్తుంది. జనరల్ ప్రేక్షకులకు ఎమోషనల్ అంశాలు కనెక్ట్ అయితే హిట్ అవుతుంది అని అంటున్నారు. మరి నేడు రాత్రి నుంచి సినిమా చూసాక ప్రేక్షకులు ఏమంటారో చూడాలి. Telugu » Movies » Ram Charan Peddi Movie First Review Cast Janhvi Kapoor Shivaraj Kumar Buchibabu Sana 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Peddi First Review : రామ్ చరణ్ పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రేపు జూన్ 4న పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా నేడు రాత్రే ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే ఇప్పటికే...