
గతంలో నిర్వహించిన ఎక్స్ట్రార్డినరీ జనరల్ సమావేశం (EGM)లో కంపెనీ వాటాదారులు కొత్త ఈక్విటీ షేర్ల జారీకి ఆమోదం తెలిపారు. ఈ IPO ద్వారా సుమారు రూ.6,650 కోట్లు సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, IPO తర్వాత కంపెనీ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది OYO భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు బలమైన ఆర్థిక మద్ధతుగా మారనుంది. IPO ప్రక్రియలో తదుపరి దశగా కంపెనీ అప్టేడెట్ డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రొస్పెక్ట్స్ (UDRHP-1)ను ప్రజల ముందుకు తీసుకురానుంది. ఈ పత్రం 21 రోజుల పాటు ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంటుంది. సమాచారం ప్రకారం, జూలై 2026 ప్రారంభంలోనే ఈ పత్రాన్ని దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారుల స్పందన, లిస్టింగ్‌కు అనుకూల సమయాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. ఈ IPO నిర్వహణ కోసం పలు ప్రముఖ ఆర్థిక సంస్థలను కంపెనీ నియమించింది. యాక్సిస్ క్యాపిటల్, సిటిబ్యాంక్, గోల్డ్‌మెన్ Sachs, ICICI Securities, SBI Capital Markets, JM Financial, InCred Capital వంటి సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఈ సంస్థల భాగస్వామ్యంతో IPO ప్రక్రియ మరింత బలంగా సాగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. SEBI మాజీ చైర్మన్ అజయ్ త్యాగీని స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డులోకి తీసుకుంది. అనుభవజ్ఞుడైన నియంత్రణ నిపుణుడు బోర్డులో చేరడం వల్ల కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ Moody’s కూడా OYO మాతృసంస్థ PRISMపై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేసింది. కంపెనీకి ఇచ్చిన B2 కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్‌ను కొనసాగిస్తూ 'స్టేబుల్ అవుట్‌లుక్'ను ప్రకటించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ EBITDA 280 మిలియన్ డాలర్లకు పైగా చేరవచ్చని Moody’s అంచనా వేసింది. G6 Hospitality కొనుగోలు, ప్రీమియం హోటళ్ల విస్తరణ, ఖర్చుల నియంత్రణ వంటి అంశాలు కంపెనీ వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. OYO IPO మార్కెట్లోకి వస్తే, భారత స్టార్టప్ రంగంలో మరో భారీ లిస్టింగ్‌గా నిలిచే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. గతంలో నిర్వహించిన ఎక్స్ట్రార్డినరీ జనరల్ సమావేశం (EGM)లో కంపెనీ వాటాదారులు కొత్త ఈక్విటీ షేర్ల జారీకి ఆమోదం తెలిపారు. ఈ IPO ద్వారా సుమారు రూ.6,650 కోట్లు సమీకరించాలని సంస్థ...