పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా దూసుకుపోతోన్న మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers).. ఇప్పుడు కోలీవుడ్ (Kollywood)పై గట్టిగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందిస్తూ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌గా పేరు తెచ్చుకున్న ఈ సంస్థ.. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తన ముద్ర వేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంటోంది. తమిళ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ వేగంగా అడుగులు వేస్తుండటంతో, ఆ సంస్థ లైన్లో పెట్టిన ప్రాజెక్ట్‌ల గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ లైనప్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రలతో దూసుకుపోతున్న వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush), మాస్ డైరెక్టర్ సిరుతై శివ (Siruthai Siva) కాంబినేషన్లో ఒక సినిమాకు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. అలాగే, ఎనర్జిటిక్ స్టార్ సిలంబరసన్ (శింబు), డైరెక్టర్ కీర్తీశ్వరన్ (‘డ్యూడ్’ ఫేమ్) కాంబోలో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉందట.

దీనితో పాటు, బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హీరోగా పేరొందిన శివకార్తికేయన్ (Sivakarthikeyan) సరికొత్త కాంబినేషన్లో కనిపించబోతున్నట్లు టాక్. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘మిషన్ మంగళ్’ ఫేమ్ జగన్ శక్తి (Jagan Shakti) దర్శకత్వంలో శివకార్తికేయన్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని, దీనిపై ప్రస్తుతం సంప్రదింపులు నడుస్తున్నాయని సమాచారం. ఇక ఇప్పటికే కోలీవుడ్‌కి చెందిన అగ్ర హీరో అజిత్ కుమార్‌తోనూ, అలాగే ప్రదీప్ రంగనాథన్తోనూ ఈ సంస్థ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇలా కోలీవుడ్ అగ్ర హీరోలతో మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ గనుక అధికారికంగా అనౌన్స్ అయితే.. తమిళ ఇండస్ట్రీలో ఈ ప్రొడక్షన్ హౌస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయమని అనిపిస్తోంది. చూద్దాం మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తోందో..

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా దూసుకుపోతోన్న మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers).. ఇప్పుడు కోలీవుడ్ (Kollywood)పై గట్టిగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో...