
అంతర్జాతీయ నిఘా వర్గాలను శాసించే అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రంగంలోనే ఓ అసాధారణ స్కామ్ వెలుగులోకి రావడం పెద్ద కలకలమే రేపుతోంది. వేల కోట్ల రహస్య ఆపరేషన్లను నడిపే ఆ సంస్థ ఖజానాకే ఒక మాజీ అధికారి కన్నం వేశాడు. ముఖ్యంగా సీఐఏ మాజీ అధికారి డేవిడ్ రష్.. అదే సంస్థకు కన్నం వేసి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టాడు. అయితే తాజాగా ఆయన నివాసంపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ జరిపిన సోదాల్లో బయటపడ్డ ఖజానాను చూసి సాక్షాత్తూ దర్యాప్తు అధికారులే నోరెళ్లబెట్టారు. ముఖ్యంగా డేవిడ్ రష్ ఇంట్లో.. 300 కిలోల బంగారం కడ్డీలతో పాటు రూ.19 కోట్ల నగదు లభ్యం అయింది. అంతేకాకుండా కుప్పలు తెప్పలుగా లగ్జరీ వాచ్‌లు దొరికాయి. ఎఫ్‌బీఐ అధికారులు పక్కా సమాచారంతో డేవిడ్ రష్ నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒక్కోటి ఒక కిలో బరువు తూగే ఏకంగా 300 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. మాజీ సీఐఏ అధికారి ఇంట్లో దొరికిన బంగారు కడ్డీల విలువ రూ.340 కోట్లు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఒక మాజీ సీఐఏ అధికారి ఇంటి నుంచి భారీ మొత్తంలో బంగారు కడ్డీలను ఫెడరల్ ఏజెంట్లు స్వాధీనం చేసుకోవడం పెద్ద కలకలమే రేపుతోంది. ప్రభుత్వ సొమ్మును దొంగిలించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న డేవిడ్ రష్ అరెస్ట్ అయ్యాడు. రష్‌పై ఉన్న కేసు వివరాలను తెలియజేస్తూ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ మాథ్యూ జాన్సన్ ఒక అఫిడవిట్లో పలు సంచలన వివరాలు నమోదు చేశారు. అయితే రష్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అభియోగానికి, అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న బంగారం లేదా డబ్బుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కోర్టు పత్రాల ప్రకారం, సీఐఏలో పనిచేసిన రష్ యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ ఏజెన్సీలో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ స్థాయి ఉద్యోగి. ఆయనకు టాప్ సీక్రెట్ క్లియరెన్స్ మరియు వర్గీకృత సమాచారానికి యాక్సెస్ ఉంది. నవంబర్ 2025 నుండి ఈ సంవత్సరం మార్చి మధ్య కాలంలో, రష్.. విధుల సంబంధిత ఖర్చుల కోసం గణనీయమైన మొత్తంలో విదేశీ కరెన్సీ, బంగారు కడ్డీలను అడిగి తీసుకున్నారంట. పని కోసం రష్కు అంత బంగారం, నగదు ఎందుకు అవసరమయ్యాయో రికార్డులలో వివరాలు లేవు. ఇక రష్ తన ప్రభుత్వ ఉద్యోగాల కోసం తన విద్యా అర్హతల గురించి అబద్ధాలు చెప్పాడు. నేవీ రిజర్వ్‌లో క్రియాశీల సభ్యుడిగా ఉన్నానని అబద్ధం చెప్పి మోసపూరితంగా సైనిక సెలవు తీసుకున్నాడు. రష్ నేవీలో ఉండేవారు, అయితే 2015లో గౌరవప్రదంగా డిశ్చార్జ్ అయ్యాడు. అయినప్పటికీ, 2025 వరకు మరో 10 సంవత్సరాల పాటు తాను నేవీ రిజర్వ్‌లో ఉంటానని చెప్పినట్లు అందులో ఉంది. ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని, ఎఫ్‌బీఐ, సీఐఏ, న్యాయ శాఖలోని భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని ఆ ఏజెన్సీలు తెలిపాయి. అత్యున్నత భద్రతా అనుమతులు కలిగిన ఒక మాజీ సీఐఏ అధికారి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో బంగారం, నగదు, విలాసవంతమైన వాచీలు దొరకడం అమెరికా గూఢచారి వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. జెన్ జెడ్ టార్గెట్ గా అతి పెద్ద డీప్ ఫేక్ వ్యూహం? Disclaimer: All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.. అంతర్జాతీయ నిఘా వర్గాలను శాసించే అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రంగంలోనే ఓ అసాధారణ స్కామ్ వెలుగులోకి రావడం పెద్ద కలకలమే రేపుతోంది. వేల కోట్ల రహస్య ఆపరేషన్లను నడిపే...