
Pawan Kalyan Post Viral : హైదరాబాద్లో జనసేన నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రముఖ కవి శేషేంద్ర శర్మ రాసిన ఒక శక్తివంతమైన కవితను ఆయన పోస్ట్ చేశారు. తెలంగాణలో జనసేన ఉనికి చాటుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేస్తూ ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్ (pawan Kalyan) , తెలంగాణ ప్రజలు తనకు ఎన్నో సందర్భాల్లో అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. “ఆంధ్రప్రదేశ్లోనే నేను అధికారాన్ని కోరుకోలేదు.. మరి తెలంగాణలో అధికారం ఎందుకు కోరుకుంటాను?” అని ఆయన ప్రశ్నించారు. తనకు పదవులపై వ్యామోహం లేదని, కేవలం సమాజంలో మార్పు కోసమే రాజకీయం చేస్తున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. Read Also: mangoes : ఫలరాజుల దిగుబడికి ‘కాపు’ కాసేదెవరు? “హైదరాబాద్లో ఎలా అడుగుపెడతావ్? ఇక్కడ నీకేం పని?” అని ప్రశ్నిస్తూ తనను బెదిరిస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులకు పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. “నన్ను అడగడానికి మీరెవరు? బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణ?” అంటూ నిలదీశారు. తాను ఇలాంటి బెదిరింపులకు అస్సలు భయపడేవాడిని కాదని తేల్చిచెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడు, ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడినా.. ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్న ఇదే కాంగ్రెస్ నేతలు ఆయన వద్ద ఊడిగం చేశారని పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన మర్రి చెన్నారెడ్డి చొరవ వల్లే తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు తరలివచ్చిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. తెలుగు ప్రజలందరూ దాదాపు 50 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని పేర్కొన్నారు. పాలకులు వేరు, ప్రజలు వేరని.. రాజకీయాల కోసం పాలకులను తిట్టాలే తప్ప సామాన్య ప్రజలను కాదని హితవు పలికారు. తనపై తొలి కేసు కూడా తెలంగాణలోనే నమోదైందని, భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా…… pic.twitter.com/VTwKD00zW2 Harish Rao Birthday Celebrations: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజున రక్తదాన శిబిరం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Hindupur news: అప్పుల బాధ తట్టుకోలేక కూల్డ్రింక్ లో విషం కలుపుకొని తల్లి, కొడుకు మృతి! YS Jagan: ఢిల్లీ అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి! South Coast Railway Zone: వందే భారత్కు కొత్త ఊపు.. అందుబాటులోకి వచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ AP Electric Buses: జులై నుంచి రోడ్డెక్కనున్న 5500 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు KTR Counter to Pawan Kalyan:సోదరుడిగా వస్తే ఆదరిస్తాం.. పాలిటిక్స్ చేస్తే ఒప్పుకోం! Nellore crime news: నెల్లూరు జిల్లాలో దారుణం.. అర్ధరాత్రి యువకులపై ఘోర దాడి! ప్రకాశం జిల్లా ఒంగోలు శివార్లలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం, ఊహించని విధంగా భారీ ఎత్తున... పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో... ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలకు సిద్ధమైందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో... జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతోంది. ఈ కాలం జూన్ 22 వరకు... తెలంగాణ వేదికగా జనసేన పార్టీ సభ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదం, విమర్శలు... ఎల్నినో ఎఫెక్ట్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ... భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి మారుతి సుజుకి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే అత్యధిక కార్లను... హైదరాబాద్లో లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. నగరంలోని ఐటీ హబ్ ఐకాన్... మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాల్లో గత ఆదివారం నుండి రుతుపవన పూర్వ (Pre-Monsoon)... రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం చల్లబడనుంది. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. Pawan Kalyan Post Viral