
Fake News Alert : సోషల్ మీడియాలో ఒక పోస్టు తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్ర పోలీస్ శాఖ, సైబర్ క్రైమ్ విభాగం పేరుతో ఒక పోస్టర్ వైరల్ అవుతోంది. అది నిజమేనని సోషల్ మీడియా యూజర్లు తెగ షేర్ చేసేస్తున్నారు. ఆ పోస్టర్ ప్రకారం.. వాట్సాప్ వినియోగం, టిక్ మార్కులు, మెసేజ్ రిప్లయ్ విధానం వంటి అంశాలపై పలు సూచనలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఉంది. అయితే, ఈ పోస్టర్‌పై తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరిక కూడా కనిపిస్తోంది. వాస్తవానికి, అధికారికంగా పోలీస్ శాఖ విడుదల చేసిన సమాచారం కాదనేది స్పష్టమవుతోంది. పోలీస్ శాఖ వివరణ ప్రకారం.. : సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ మెసేజ్ పూర్తిగా అవాస్తవమని ప్రకటించింది. ఇలాంటి ఫేక్ పోస్టర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని తెలిపింది. ప్రజల్లో భయం, గందరగోళం నెలకొనేలా కొంతమంది అధికారిక గుర్తులు, లోగోలతో ఫేక్ కంటెంట్ రూపొందిస్తున్నారు. ఈ పోస్టర్ కూడా అదే కోవకు చెందినదిగా పోలీసు శాఖ చెబుతోంది. కొందరు ఆకతాయిలు చేస్తున్న తప్పుడు ప్రచారంగా పేర్కొంది. వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలోనూ అనేకసార్లు అప్రమత్తం చేశామని తెలిపింది. అయినప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా షేర్ చేస్తున్నారని ఇది ఫేక్ న్యూస్ అంటూ వీసీ సజ్జనర్ ఐపీఎస్ తన సోషల్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. Read Also : PhonePe SBI Card : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్.. జూలై 1 నుంచి ఈ పేమెంట్లపై రివార్డ్ పాయింట్లు బంద్! సైబర్ క్రైమ్ ప్రకారం.. : ఏదైనా అధికారిక సమాచారం పోలీసు శాఖ రిలీజ్ చేస్తే.. అది అధికారిక వెబ్సైట్, అధికారిక సోషల్ మీడియా అకౌంట్లు లేదా ప్రెస్ నోట్ ద్వారా మాత్రమే ప్రకటిస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాట్సాప్ ఫార్వర్డ్లు లేదంటే తెలియని సోర్స్‌ల నుంచి వచ్చే మెసేజ్ లను అసలు నమ్మకూడదని సూచించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం పూర్తిగా అవాస్తవం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కొందరు ఆకతాయిలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఇదే విషయమై గతంలో పలుమార్లు అప్రమత్తం… pic.twitter.com/kTkwbrJ9aa రాష్ట్ర ప్రజలెవరైనా ఇలాంటి పోస్టర్లు చూస్తే ముందుగా వెరిఫై చేయడం ఎంతైనా మంచిది. అనుమానాస్పద సమాచారాన్ని చెక్ చేయకుండా వెంటనే షేర్ చేయరాదు. అలాగే, సంబంధిత అధికారిక ఛానెల్‌లను చెక్ చేయడం లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించింది. బాధ్యతగల పౌరులైన వారంతా ఇలాంటి ఫేక్ వార్తలను అసలు నమ్మొద్దని, షేర్ చేయొద్దని సూచించింది. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసు శాఖ స్పష్టం చేసింది. Telugu » Telangana » Fake News Alert Do Not Believe Or Share This Message Says Police — V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 3, 2026 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Fake News Alert : సోషల్ మీడియాలో ఒక పోస్టు తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్ర పోలీస్ శాఖ, సైబర్ క్రైమ్ విభాగం పేరుతో ఒక పోస్టర్ వైరల్ అవుతోంది. అది నిజమేనని...