
Pandu Master : డ్యాన్సర్, డ్యాన్స్ మాస్టర్ పండు ‘ఢీ’ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కమెడియన్ గా కూడా పలు టీవీ షో లు, సినిమాలలో నటిస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఓ ఈవెంట్ కి వెళ్లి తిరిగొస్తుండగా విశాఖపట్నం ఆనంద పురం జంక్షన్లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పండు కారు వెనుక భాగంలో నిలబడగా, వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక బొలేరో వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పండుని వెంటనే ఘటన స్థలం నుంచి విశాఖలోని మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అక్కడి వైద్యులు పండుకు చికిత్స అందిస్తున్నారు. Also Read : Aamir Khan : 61 ఏళ్ళ వయసులో సైలెంట్ గా మూడో పెళ్లి చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్.. ఆమెతోనే.. ఎప్పుడు ఎక్కడ? తాజాగా ఆ హాస్పిటల్ ఆర్దో సర్జన్ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి రెండు గంటలకు హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఆయన్ని పరిశీలించాము. ఎడమ తుంటి కీలు జారడం జరిగింది. అలాగే మోకాళ్ళ కింద రెండు కాళ్ళు విరిగిపోయాయి. వెంటనే తుంటి ఎముక ఆపరేషన్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసాము. ఇవాళ రెండు కాళ్లకు ఆపరేషన్ చేస్తున్నాము. ప్రాణాపాయ పరిస్థితి ఏమి లేదు. మిగిలిన శరీరభాగాలు కూడా స్కాన్ చేసాము. వేరే ఎలాంటి సమస్యలు లేవు. రెండు కాళ్లకు ఆపరేషన్స్ పడతాయి. కనీసం ఆయన రికవరీ అవ్వడానికి ఆరు నెలలు పడుతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు డ్యాన్స్ చేయొచ్చు అని తెలిపారు. దీంతో పండు అభిమానులు, ఆయన సన్నిహితులు. పలువురు టీవీ సెలబ్రిటీలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. Telugu » Movies » Doctors Gives Clarity On Dhee Fame Pandu Master Health 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Pandu Master : డ్యాన్సర్, డ్యాన్స్ మాస్టర్ పండు ‘ఢీ’ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కమెడియన్ గా కూడా పలు టీవీ షో లు, సినిమాలలో నటిస్తూ మరింత పాపులారిటీ...