
మాస్కో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ పనితీరు అద్భుతంగా ఉందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇదొకటని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. భారత్లో కూడా ఇటువంటి సమగ్ర, సాంకేతిక రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన రష్యా పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన మాస్కోలోని ఈ అత్యాధునిక రవాణా అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ బృందానికి మాస్కో రవాణా శాఖ ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అటానమస్ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విభాగాధిపతి పావెల్ బోక్షా, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ హెడ్ ఓల్గా పిచికోవా, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అలెగ్జాండర్ సువోరోవ్, ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ డైరక్టర్ జనరల్ సలహాదారు మస్తిస్లావ్ ఇసాకోవ్ వంటి కీలక అధికారులు లోకేష్ బృందాన్ని స్వాగతించి, సెంటర్ కార్యకలాపాలను వివరించారు.అనంతరం, మాస్కో అటానమస్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ అభివృద్ధి, దాని ప్రత్యేకతల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా మాస్కో ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ పనితీరు, కార్యకలాపాల గురించి లోకేష్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా అక్కడి అధునాతన టికెటింగ్ సిస్టమ్స్, డెవలప్మెంట్ లేబరేటరీని ఆయన బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మాస్కో రవాణా వ్యవస్థలోని ప్రత్యేకతలను ప్రస్తావించారు. "ఇక్కడ మెట్రో, బస్సులు, ట్రాలీలు, ఎలక్ట్రిక్ రైళ్లతో పాటు బైక్-షేరింగ్, స్కూటర్ల వరకు అన్నీ ఒకే పర్యావరణ మాస్కో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ పనితీరు అద్భుతంగా ఉందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇదొకటని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి...