
ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడయ్యాయి (Stock Market Today). పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోతాయనే అంచనాల మధ్య సూచీలు లాభాల్లో కదలాడాయి. దాంతో సెన్సెక్స్ 1100 పాయింట్లు వరకు పెరిగింది.... సెన్సెక్స్ నేటి ట్రేడింగ్‌లో 76,135 వద్ద మొదలైంది. చివరకు 1,073 పాయింట్ల లాభంతో 76,488 వద్ద ముగిసింది. నిఫ్టీ 312 పాయింట్లు ఎగబాకి, 24వేల పైన స్థిరపడింది. నిఫ్టీ సూచీలో ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, టీఎంపీవీ, లార్సెన్ షేర్లు రాణించాయి. మ్యాక్స్ హెల్త్‌కేర్, ఓఎన్జీసీ, హిందాల్కో, నెస్లే, బజాజ్ ఆటో స్టాక్స్ నష్టపోయాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.