
పని ప్రదేశంలో స్త్రీపురుష సమానత్వం.. ఇది మాటలకే పరిమితమవుతోంది తప్ప చాలా సంస్థల్లో నేటికీ ఇది సాధ్యం కాలేదనే చెప్పాలి. తన ఉద్యోగంలో భాగంగా చేసిన ఓ పరిశోధనతో ఈ అసమానతల్ని, ఇందుకు గల అసలు కారణాల్ని గుర్తించింది ఆంచల్ కక్కర్. పని ప్రదేశంలో స్త్రీపురుష సమానత్వం.. ఇది మాటలకే పరిమితమవుతోంది తప్ప చాలా సంస్థల్లో నేటికీ ఇది సాధ్యం కాలేదనే చెప్పాలి. తన ఉద్యోగంలో భాగంగా చేసిన ఓ పరిశోధనతో ఈ అసమానతల్ని, ఇందుకు గల అసలు కారణాల్ని గుర్తించింది ఆంచల్ కక్కర్. ఎలాగైనా ఈ సమీకరణాన్ని తిరగరాయాలనుకున్న ఆమె.. ఈ ఆలోచనతోనే తన సంస్థ ద్వారా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అటు సంస్థలు, ఇటు మహిళా ఉద్యోగుల్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోంది. తద్వారా ఆయా సంస్థలు మహిళలకు తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించేలా, నాయకత్వ హోదాలు అందించేలా.. చొరవ చూపుతోంది. ఇలా స్త్రీ సాధికారతకు, పని ప్రదేశంలో మహిళల సమానత్వానికి కృషి చేస్తోన్న ఆంచల్.. మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అంటోంది. దిల్లీకి చెందిన ఆంచల్ సీఏ చదివింది. ఆపై ఓ సంస్థలో కొన్ని నెలల పాటు ఇంటర్న్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే తన కెరీర్ నలుగురికీ ఉపయోగపడేలా, స్ఫూర్తి నింపేలా ఉండాలనుకుందామె. ఈ ఆలోచనతోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసిన ఆమె.. ఆ తర్వాత ‘బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్’లో చేరింది. ‘ఈ సంస్థలో చేరాక ‘ఉద్యోగాల భవిష్యత్తు’పై అధ్యయనం చేయమని నాకో ప్రాజెక్ట్ అప్పగించారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో వివిధ రంగాలకు చెందిన సంస్థలతో దగ్గరగా పనిచేసే అవకాశం దొరికింది. అంతేకాదు.. నా నెట్వర్కింగ్ పరిధి పెరిగింది.. వ్యూహాత్మకంగా ఆలోచించే నైపుణ్యాలూ అలవడ్డాయి. ఇదే సమయంలో ఆయా సంస్థల్లో స్త్రీపురుష అసమానతల గురించీ తెలుసుకోగలిగా. చాలా కంపెనీల్లో ప్రవేశ స్థాయిలో ఎక్కువమంది మహిళా ఉద్యోగులు చేరుతున్నా.. మధ్యస్థాయి, నాయకత్వ హోదాల్ని పరిశీలిస్తే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించా. అయితే ఇందుకు తమ వ్యక్తిగత బాధ్యతలే కాదు.. పని ప్రదేశంలో చుట్టూ ఉన్న వారు వాళ్లను ప్రోత్సహించకపోవడమూ ఓ కారణమని ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి నాకు అర్థమైంది. ఒకవేళ నాయకత్వ హోదాల్ని అందుకున్నా.. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే వారి మాటలకు, నిర్ణయాలకు సరైన గుర్తింపు, గౌరవం దక్కట్లేదని తెలుసుకున్నా. ఇలా పని ప్రదేశంలో అడుగడుగునా మహిళాభివృద్ధిని అడ్డుకుంటోన్న ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలనుకున్నా. ఇదే 2020లో ‘ఈక్వీలీడ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించేలా చేసింది..’ అంటోంది ఆంచల్. తను సహ-వ్యవస్థాపకురాలిగా ఉన్న ‘అర్థాన్’ (Arthan) సంస్థ వేదికగా దీన్ని ప్రారంభించినట్లు చెబుతోందామె. సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశగా కృషి చేస్తోన్న ఆయా సంస్థలకు సలహాలిచ్చే కంపెనీ ఇది. ఈ క్రమంలోనే తన బృందంతో కలిసి ముందుగా ఆయా రంగాలకు చెందిన దాదాపు 128 సంస్థలపై లోతుగా అధ్యయనం చేసిన ఆంచల్.. పని ప్రదేశంలో మహిళల అసమానతలకు గల అసలు కారణాలేంటో తెలుసుకోగలిగానంటోంది. ‘మేం చేసిన అధ్యయనంలో భాగంగా.. కొన్ని సంస్థలు మాత్రమే తమ వద్ద పనిచేస్తోన్న మహిళా ఉద్యోగుల్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుసుకోగలిగాం. ఇక 1/3 వంతు సంస్థల్లోనే మహిళలు నాయకత్వ హోదాల్లో పనిచేస్తున్నట్లు గ్రహించాం. ఇక మరికొన్ని సంస్థలు తమ మహిళా ఉద్యోగుల కోసం రూపొందించిన విధివిధానాలను ఇప్పుడిప్పుడే ఆచరణలో పెట్టే పనిలో ఉన్నట్లు గుర్తించాం. ఇలా పని ప్రదేశంలో మహిళల అసమానతల్ని దూరం చేయాలంటే.. ఇటు మహిళా ఉద్యోగులు, అటు సంస్థల్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయనిపించింది. ఈ ఆలోచనతోనే గతేడాది జనవరిలో ‘ఈక్వీలీడ్’ వేదికగా ‘జెండర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ను ప్రారంభించాం. ఆరు నెలల కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా మొదటి మూడు రోజులు ప్రత్యేకమైన వర్క్‌షాప్ నిర్వహిస్తాం. వివిధ సంస్థలకు చెందిన ఉన్నతోద్యోగుల్ని ఒక్క చోట చేర్చి.. ఆయా ప్రాజెక్టుల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించుకునే అవకాశం కల్పిస్తాం. దీనివల్ల తమ సంస్థ ఎందులో వెనకబడింది? తమ సంస్థల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు ఎలా పెంపొందించవచ్చు.. వంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ క్రమంలోనే కొందరు సీనియర్ మహిళా ఉద్యోగులు తాము సాధించిన విజయాలు, పురోగతి గురించీ పంచుకోవడంతో.. నాయకత్వ హోదాల్లో మహిళల నియామకం ఎంత ముఖ్యమో అన్న విషయం ఇతర సంస్థలకు అర్థమవుతుంది. ఇలా ఆయా సంస్థలు తమ కార్యాచరణను రూపొందించుకున్నాక.. మహిళా ఉద్యోగులకు తమ రంగాల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పిస్తాం. ఈ క్రమంలో ఆన్లైన్/ఆఫ్‌లైన్ క్లాసులు, వెబినార్లు నిర్వహిస్తాం. వీటి ద్వారా వారి నెట్వర్కింగ్ పరిధిని విస్తరించుకునే అవకాశం కల్పిస్తాం. అలాగే తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాల్లో చేరేలా పలువురు మహిళల్ని ప్రోత్సహిస్తున్నాం. అంతేకాదు.. వారు చేరిన సంస్థల్లో ఉన్నత స్థానాలకు ఎదిగేలా, అక్కడ సురక్షితమైన, అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పించేలా కృషి చేస్తున్నాం..’ అంటోన్న ఆంచల్.. ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు