
హైదరాబాద్: భారత్‌లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడులు వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై ఇరు పక్షాలు చర్చించాయి. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రత్యేకతలను దక్షిణాఫ్రికా ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అత్యాధునిక రంగాలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని సీఎం తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని దక్షిణాఫ్రికా బృందాన్ని కోరారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఈ రంగంలో దక్షిణాఫ్రికా కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించనున్న ‘‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026’’లో పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలేతో పాటు అక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను సీఎం ఆహ్వానించారు. సీఎం ఆహ్వానంపై మషాటిలే స్పందిస్తూ.. పెద్ద సంఖ్యలో తమ ప్రతినిధులు పాల్గొంటారని, ఈ సదస్సు ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార, పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు. అనంతరం జర్మనీలోని తురింగియా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, జీవ వైజ్ఞానిక రంగాల్లో పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో తురింగియా ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల ఖండించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శివ అనే ద్విచక్రవాహనదారుడు బస్సు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. వాతావరణ మార్పుల వేళ భారతీయ శాస్త్రవేత్తలు సరికొత్త రికార్డులు సృష్టించారు. దేశంలోని వివిధ నీటి ఆవాసాల నుంచి కొత్త కీటకాల జాతులను కనుగొన్నారు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics.