
– టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ రుద్రంపూర్, జూన్ 03 : బొగ్గు గని కార్మికులు దుమ్ము, ధూళి, కాలుష్యం మధ్య ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నప్పటికీ అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కొత్తగూడెం, కార్పొరేట్ ఏరియాల్లోని అన్ని గనుల మేనేజర్లు, వివిధ విభాగాల హెచ్వోడీలకు బుధవారం వినతిపత్రాలు అందజేశారు. టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు మెమోరాండం పంపించాలని ఆయా డిపార్ట్మెంట్ హెడ్లను కోరారు. ఈ సందర్భంగా కాపు కృష్ణ మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతో విధులకు హాజరు కాలేక జీతాలు కోల్పోయి అప్పుల పాలవుతున్న కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి నెల రెండు మెడికల్ బోర్డులను నిరంతరాయంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో వేలాది మంది కార్మిక కుటుంబాలు నిరాశలో ఉన్నాయన్నారు. గత 15 నెలలుగా ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. విజిలెన్స్ విచారణల పేరుతో కార్మికులను వేధించడం మానుకుని, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నియామకాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను సింగరేణికి రాబట్టాలని, కార్మికులు పెర్క్స్‌పై చెల్లిస్తున్న ఆదాయపు పన్నును తిరిగి చెల్లించాలని, గైర్హాజరు పేరుతో జారీ చేసిన డిస్మిస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త బొగ్గు గనుల కేటాయింపునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ప్రస్తుతం ఉన్న గనులను సింగరేణి ఉద్యోగులతోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్, సెంట్రల్ కమిటీ సభ్యులు కాగితపు విజయ్ కుమార్, బూర్గుల రవికుమార్, ఎంటెక్ మహేందర్, కంచర్ల శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీలు బండారి రాజ్ కుమార్, నమిల్ల వెంకటేశ్వర్లు, రఘువీర్, ఆంజనేయులు, తిరుపతి, సూరజ్, సూర్యనారాయణ, జైపాల్, కుమార్, శ్రీకాంత్, చంద్రశేఖర్, రాజు, రాంబాబు, సంతోష్, రవి వర్మ పాల్గొన్నారు. ‘మెడికల్ బోర్డులు తక్షణమే నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి’ # 8-2-603/1/7,8&9, Krishnapuram, Road No. 10, Banjara Hills, Telangana - 500034. Phone: +91 40 2329 1999 Website: +91-40-23291163 digitalsales@tppl.news The content of this site is © 2026 Telangana Publications pvt. Ltd – టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ రుద్రంపూర్, జూన్ 03 : బొగ్గు గని కార్మికులు దుమ్ము, ధూళి, కాలుష్యం మధ్య ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నప్పటికీ అనారోగ్యానికి...