
హైదరాబాద్: ఎండల తీవ్రతకు తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. తీవ్ర వడగాల్పులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అతి తీవ్ర స్థాయిలో వడగాల్పులు వ... హైదరాబాద్: ఎండల తీవ్రతకు తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. తీవ్ర వడగాల్పులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అతి తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశముందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వడగాల్పులపై మొదటిసారిగా ఈ హెచ్చరిక జారీ అయింది. అతితీవ్ర వడగాల్పులు వీచే అవకాశమున్న జిల్లాల్లో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఉన్నాయి. వీటికి రెడ్ అలర్ట్ జారీ అయింది. మరో 8 జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే వీలుంది. వీటిలో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఉన్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.