
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' రేపు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రేజీ మూవీ రిలీజ్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొనగా.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఒక అమేజింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు టాలీవుడ్లోనే హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ‘పెద్ది’ గెటప్‌లో భారీ విగ్రహం.. ‘శ్రీ కొణెదెల రామ్ చరణ్ దేవాలయం’! రేపు ‘పెద్ది’ సినిమా రిలీజ్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కూకట్పల్లి వేదికగా అభిమానులు చేసిన ఒక పని తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. కూకట్‌పల్లిలోని ప్రముఖ అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ అభిమానులు ఏకంగా ఆయనకు గుడి కట్టేశారు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ పోషించిన పల్లెటూరి మాస్ రెజ్లర్ క్యారెక్టరైజేషన్‌ను పోలి ఉండేలా అభిమానులు థియేటర్ ప్రాంగణంలో ఒక భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతేకాదు ఆ విగ్రహం ఉన్న ప్రాంతానికి ‘శ్రీ కొణెదెల రామ్ చరణ్ దేవాలయం’ అని బోర్డు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లోబల్ స్టార్ క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్ళిందో చెప్పడానికి ఈ ఘటనే ఒక పర్ఫెక్ట్ నిదర్శనం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే అర్జున్ థియేటర్ వద్ద వాతావరణం ఒక పెద్ద జాతరను తలపిస్తోంది. చరణ్ విగ్రహానికి అభిమానులు క్యూ కట్టి మరీ క్షీరాభిషేకాలు (పాలాభిషేకాలు) చేస్తున్నారు. కర్పూర హారతులు ఇస్తూ, కొబ్బరికాయలు కొడుతూ థియేటర్ దగ్గర పండగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రిలీజ్‌కు ముందే ఈ రేంజ్ హంగామా ఉందంటే.. రేపు థియేటర్లలో ‘పెద్ది’ బొమ్మ పడ్డాక మెగా ఫ్యాన్స్ సృష్టించే విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' రేపు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్...