
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొద్దిసేపటి క్రితమే కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌ లోని గ్లాస్‌ హౌస్‌ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్.. డీకే శివకుమార్ తో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సీనియర్ నేత జి. పరమేశ్వర్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితోపాటు మరో 12 మంది మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు.అయితే అధికారిక ముఖ్యమంత్రి నివాసమైన కావేరి బంగ్లాలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కుదిరిన ఒక అసాధారణ అధికార-భాగస్వామ్య ఒప్పందం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డీకే శివకుమార్ సీఎంగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టినా.. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సిద్ధరామయ్య మాత్రం కావేరి బంగ్లాలోనే నివాసం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది సంప్రదాయబద్ధంగా ప్రస్తుత ముఖ్యమంత్రికి కేటాయించబడుతుంది. కానీ ఇటీవలి ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య 2028 వరకు కావేరి నివాసాన్ని తన ఆధీనంలో ఉంచుకోనున్నారు.ఈ ప్రత్యేక ఏర్పాటు వల్ల సీఎం డీకే శివకుమార్ మొదట ఒక ప్రైవేట్ ఇంటి నుండి తన కార్యకలాపాలను నిర్వర్తించనున్నారు. ఆ తర్వాత మరొక ప్రభుత్వ నివాసానికి మారతారు. కావేరి బంగ్లాలోకి ఆయన వెంటనే ప్రవేశించకపోవచ్చు. ఇక పార్టీ అంతర్గత వర్గాలు దీనిని ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకుల మధ్య కుదిరిన స్నేహపూర్వక అవగాహనగా అభివర్ణిస్తున్నారు. ఇది సజావైన నాయకత్వ మార్పిడికి తోడ్పడుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.ఇక ఇవాళ ఏర్పడిన కర్ణాటక క్యాబినెట్ 2.0 కేబినెట్ లో పలువురు ప్రముఖులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే ఉన్నారు. వీరిద్దరికీ మంత్రివర్గంలో చోటు దక్కింది. అలాగే కె.హెచ్‌. మునియప్ప, కె. జె. జార్జ్‌, ఎం. బి. పాటిల్‌, రామలింగారెడ్డి, సతీశ్‌ జర్కి హోళి, కృష్ణ బైరిగౌడ, యు. టి. ఖాదిర్‌, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్‌, శరణ్ ప్రకాశ్‌ పాటిల్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొద్దిసేపటి క్రితమే కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌ లోని గ్లాస్‌...