
సినిమా ఆడటం అనేది ఆ సినిమా హీరోకి.. లేదంటే ఆ డైరెక్టర్‌కో, నిర్మాతకో, హీరోయిన్‌కో అవసరం. కానీ ఇప్పుడు పెద్ది సినిమా హిట్ అవ్వడం ఇండస్ట్రీకి అత్యవసరం. గత ఆర్నెళ్లుగా ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. దాదాపు కోవిడ్ టైమ్‌లోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో ప్రాణభయంతో థియేటర్స్‌కి వచ్చేవారు కాదు.. అలాంటి టైమ్‌లో ఉప్పెన వచ్చింది ‘ఉప్పెన’ సినిమా. కానీ ఇప్పుడు అలాంటి ప్రాణభయాలు లేకపోయినా కూడా.. ప్రేక్షకుడు థియేటర్స్‌కి రావడం లేదు. వెండితెరపై వెలుగుల్లేక థియేటర్స్ వెలవెలబోతున్న తరుణంతో ఐదేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ థియేటర్స్‌కి పూర్వ వైభవాన్ని ‘ఉప్పెన’లా తీసుకొచ్చారు ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సాన. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కుస్తీ పట్టించి మరీ బాక్సాఫీస్ గస్తీకాస్తూ విజయఢంకా మోగించారు. రామ్ చరణ్ సినీ లైబ్రరీలో టాప్ మూవీ అంటే రెండో ఆలోచన లేకుండా టక్కున చెప్పే సినిమా అంటే ‘రంగస్థలం’. ఆ సినిమాతోనే రామ్ చరణ్.. తనలోని పరిపూర్ణ నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పటి వరకూ తనపై ఉన్న విమర్శలకు చిట్టిబాబు పాత్రతో చెక్ పెట్టారు. రంగస్థలం వరకూ రామ్ చరణ్ అంటే.. చిరంజీవి కొడుకుగా మాత్రమే గుర్తింపు. కానీ ఆ సినిమా తరువాత లెక్కలన్నీ మారిపోయేట్టు చేశారు మన లెక్కల మాస్టార్ సుకుమార్. ఇప్పుడు గురువుని మించిన శిష్యుడిగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన ‘పెద్ది’ని చాలా పే..ద్దగా రూపొందించారు. తన సినీ లైబ్రరీలో ‘పెద్ది’నే టాప్ అని స్వయంగా రామ్ చరణ్‌తోనే బుచ్చిబాబు అనిపించారంటే.. రంగస్థలాన్ని మించే ‘పెద్ది’ ఉండబోతుందనే హోప్స్ కలిగించారు. మరి పెద్ది ఆడించిన ఆట.. బాక్సాఫీస్‌ని చేయబోయే వేట ఎలా ఉంటుందో సమీక్షలో చూద్దాం. 1990ల కాలం బ్యాక్ డ్రాప్లో నడిచే కథ 'పెద్ది'. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర విజయనగరం ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో రామ్ చరణ్ ‘పెద్ది’గా మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. పట్టుదల కలిగిన గ్రామీణ యువకుడిగా.. క్రికెట్, కుస్తీ వంటి క్రీడల ద్వారా తన ఊరి ప్రజల హక్కుల కోసం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే మల్లయోధుడిగా కనిపించారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన పెద్ది కథ.. జాతీయ స్థాయిలో మారుమోగేలా.. ఓ ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించారు. (పూర్తి రివ్యూ కాసేపట్లో) పెద్ది ప్రారంభం నుంచి రిలీజ్ వరకూ.. నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శృతి హాసన్ (ఐటమ్ సాంగ్), శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, రవి కిషన్. దర్శకత్వం: బుచ్చిబాబు సాన సంగీతం: ఎ.ఆర్ రెహమాన్ నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బడ్జెట్: దాదాపు రూ.350 కోట్లు ఓటీటీ రైట్స్: రిలీజ్ తరువాత ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. పెద్ది డిజిటల్ రైట్స్ రూ.105 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. 🔹మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా 'RC16' ప్రాజెక్ట్ 2024 మార్చి 20న గ్రాండ్‌గా ప్రారంభమైంది. 🔹‘RC16’ ప్రాజెక్ట్‌కి 2025 మార్చిలో ‘పెద్ది’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించి.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం 2025 ఏప్రిల్‌లో వీడియో గ్లింప్స్ విడుదల కాగా.. రామ్ చరణ్ ఊర మాస్ గెటప్‌లో సర్ ప్రైజ్ చేశారు. 🔹2024 మార్చి 20న షూటింగ్ ప్రారంభం కాగా.. 2026 ఏప్రిల్ ఎండింగ్‌కి షూటింగ్ కంప్లీట్ చేశారు. 🔹పెద్ది పాత్ర కోసం రామ్ చరణ్ కుస్తీలో కఠోర శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్.. పవర్ ఫుల్ రెజ్లర్‌గా కనిపించడం కోసం ‘దంగల్’ టీంని రంగంలోకి దింపారు. అప్పట్లో అమీర్ ఖాన్‌కి దంగల్ సినిమా కోసం శిక్షణ ఇచ్చిన టీం.. ‘పెద్ది’ని పదునెక్కించింది. ‘దంగల్’ కోచ్ ఆధ్వర్యంలో సుమారు 4 నెలల పాటు కఠినమైన కుస్తీ శిక్షణ తీసుకున్నారు రామ్ చరణ్. ఇంటర్నేషనల్ ట్రైనర్స్‌ని మాత్రమే కాకుండా.. సహజసిద్ధమైన నేటివిటీ లుక్ కోసం.. లంగాణకు చెందిన స్థానిక రెజ్లర్లతో కూడా శిక్షణ తీసుకున్నారు. తెలంగాణకు చెందిన కొంతమంది రైజర్లను రియలిస్టిక్ లుక్ కోసం షూటింగ్లో భాగంలో చేశారు. 🔹ఈ యాక్షన్స్ సీక్వెన్స్‌లలో భాగంగా.. రామ్ చరణ్ కంటికి కాళ్లకి చేతులకు బలమైన గాయాలు అయ్యాయి. కంటికి తగిలినా.. చేయి విరిగినా కూడా వెనక్కి తగ్గలేదు పెద్ది. ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం పనిచేశారు. 🔹‘పెద్ది’ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉండటంతో.. దానికి తగ్గట్టుగా వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు బుచ్చిబాబు సన. హైదరాబాద్‌తో పాటు పుణే, కన్యాకుమారి, కొలంబో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. పల్లెటూరి వాతావరణంలో జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా గ్రౌండ్‌ని ఏర్పాటు చేశారు. 🔹రంగస్థలం తరువాత అటు రామ్ చరణ్