మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం రాజీనామాతో తమిళనాడులో రాజ్యసభ స్థానానికి ఉప-ఎన్నిక జరుగుతోంది. ఈ సీటును తన మిత్రపక్షం కాంగ్రెస్‌కు కేటాయిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విజయ్ ఓ ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మైలం నియోజకవర్గం నుంచి షణ్ముగం ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన.. ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏదో ఒక సభ నుంచే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దీంతో రాజ్యసభ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరగనుంది. ‘‘జూన్ 18న తమిళనాడులో రాజ్యసభకు ఎన్నిక జరగనుంది.. ఆ సీటును మా మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలని తమిళగ వెట్రి కళగం నిర్ణయం తీసుకుంది’’ అని విజయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదల కాగా.. నామినేషన్లు దాఖలకు చివరి రోజు జూన్ 8. 9న నామినేషన్ల పరిశీలన, 11 ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఒకరు కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే జూన్ 18న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ సెక్రటేరియట్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయ్ నాయకత్వంలోని టీవీకే విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోవడంతో కాంగ్రెస్ , వీసీకే, కమ్యూనిస్ట్, ఐయూఎంఎల్ మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఒక్క సీటుకు టీవీకే పోటీచేస్తుందని భావించారు. కానీ, విజయ్ అనూహ్యంగా కాంగ్రెస్‌కు కేటాయించారు. సీనియర్ నేత చిదంబరంతో భేటీ తర్వాత విజయ్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకేలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటాయని తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఉప ఎన్నిక కావడంతో సభ్యుడి పదవీకాలం కేవలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం రాజీనామాతో తమిళనాడులో రాజ్యసభ స్థానానికి ఉప-ఎన్నిక జరుగుతోంది. ఈ సీటును తన మిత్రపక్షం కాంగ్రెస్‌కు కేటాయిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి,...