
దర్శకుడు, ప్రముఖ క్యారెక్టర్ నటుడు కాశీ విశ్వనాథ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ కెరీర్, విజయం, వైఫల్యాలపై ఆసక్తికర విషయంలోను పంచుకున్నారు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా ఎదుగుతారని అందరూ భావించిన తాను, నందమూరి కళ్యాణ్ రామ్ తొలి చిత్రం తొలిచూపులోనే సహా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన తర్వాత ఎందుకు నటుడిగా మారాల్సి వచ్చిందో వివరించారు. తాను ఇండస్ట్రీలోకి దర్శకుడిగా వస్తే, విధి నటుడిగా మార్చిందని, ఇప్పటివరకు దాదాపు 250 సినిమాల్లో నటించానని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. సినీ రంగంలో విజయం అనేది కేవలం డబ్బు, ప్రణాళికల వల్ల రాదని, అది "గాడ్స్ డిజైన్" అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన కెరీర్‌ను వంద శాతం ప్లాన్ చేసుకోవడం ఫూలిష్‌నెస్ అని, షార్ట్ టర్మ్ ప్లానింగ్‌తో ఫ్లోలో వెళ్లడమే సంతోషానికి దారి తీస్తుందని ఆయన అన్నారు. పరిశ్రమలో డబ్బు ఉన్నంత మాత్రాన దీర్ఘకాలికంగా నిలదొక్కుకోలేరని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది నిర్మాతలు తమ కొడుకులను హీరోలుగా లాంచ్ చేసినప్పటికీ, అందరూ సక్సెస్ కాలేదని అన్నారు. దిగ్గజ దర్శకులు దాసరి నారాయణ రావు, కోదండరామిరెడ్డి, కె. రాఘవేంద్రరావు, హాస్యనటులు ఏవీఎస్, బ్రహ్మానందం వంటి వారి పిల్లలు హీరోలుగా విజయాలు సాధించలేకపోయారని గుర్తు చేశారు. ఈవీవీ సత్యనారాయణ కుమారులు రాజేష్, అల్లరి నరేష్‌లలో నరేష్ మాత్రమే విజయవంతమైన నటుడిగా కొనసాగడం ప్రేక్షకుల ఆదరణేనని ఆయన అన్నారు. ప్రేక్షకులు అంగీకరిస్తేనే ఎవరైనా సక్సెస్ అవుతారని, రాజకీయ నాయకులకు ఓట్లు ఎలా ముఖ్యమో, సినీ రంగంలోనూ ప్రేక్షకుల ఆదరణ అంతే కీలకమని కాశీ విశ్వనాథ్ తేల్చి చెప్పారు. నువ్వు లేక నేను లేను వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో ఒకప్పుడు లవర్ బాయ్‌గా పేరు పొందిన తరుణ్, ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉండటంపై కాశీ విశ్వనాథ్ మాట్లాడారు. తరుణ్ ఇప్పటికీ మంచి లుక్, పర్సనాలిటీ కలిగి ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు లేకపోవడానికి సమయం కారణమని, ప్రతి ఒక్కరికీ ఒక సమయం ఉంటుందని, ఆ సమయం దాటిపోతే పరిశ్రమ పెద్దగా పట్టించుకోదని ఆయన అన్నారు. సినీ రంగంలో రాజకీయాలు కూడా కెరీర్‌ను ప్రభావితం చేస్తాయని కాశీ విశ్వనాథ్ పరోక్షంగా అంగీకరించారు. నిర్మాత, దర్శకుడు, హీరోల మధ్య "కంఫర్ట్" ఒక ముఖ్యమైన అంశమని, కొన్నిసార్లు ఒక హీరో ఒక నిర్మాతతో పనిచేయడానికి ఇష్టపడకపోవచ్చని అన్నారు. ఇది డబ్బు కంటే మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయమని వివరించారు. ఒక బ్యానర్‌తో లేదా ఒక దర్శకుడితో కొన్ని పనులు చేసేటప్పుడు ఏర్పడే అనుబంధం దీనికి కారణం కావచ్చునని ఆయన అన్నారు. దర్శకుడు శరత్ అల్లుడు అనే పేరుతో వరుస విజయాలు సాధించినప్పటికీ, హలో అల్లుడు చిత్రం పరాజయం పాలవడంతో ఆ ట్రెండ్ ముగిసిందని, ఇది ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పును సూచిస్తుందని తెలిపారు. సినీ రంగంలో విజయం అనేది నిరంతర శ్రమ, అదృష్టం, అన్నింటికీ మించి ప్రేక్షకుల ఆదరణ పైనే ఆధారపడి ఉంటుందని అని కాశీ విశ్వనాథ్ అన్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి [caption id="attachment_1833239" align="alignnone" width="1280"] Hero Tarun[/caption] దర్శకుడు, ప్రముఖ క్యారెక్టర్ నటుడు కాశీ విశ్వనాథ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ కెరీర్, విజయం, వైఫల్యాలపై ఆసక్తికర విషయంలోను పంచుకున్నారు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా ఎదుగుతారని...