
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Peddi X Review : కొంతమంది ప్రేక్షకులు సినిమా మొదట బాగానే ప్రారంభమైందని చెబుతున్నారు. అయితే కథ ముందుకు సాగే కొద్దీ సాధారణంగా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, కథలో కొత్తదనం తక్కువగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక నెటిజన్ చేసిన ట్వీట్ ప్రకారం, ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్‌లో సినిమా పూర్తిగా ట్రాక్ తప్పిందని పేర్కొన్నారు. సన్నివేశాలు ఎక్కువగా సాగడం, స్క్రీన్‌ప్లే నెమ్మదిగా ఉండటం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వంటి అంశాలు మైనస్‌గా మారాయని చెప్పారు. అలాగే క్లైమాక్స్ కూడా అనుకున్న స్థాయిలో లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాకు సరైన ముగింపు లేదని, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం నిరాశపరిచిందని కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే మరోవైపు పాజిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. మరో నెటిజన్ సెకండ్ హాఫ్ చాలా బాగుందని, ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని ట్వీట్ చేశారు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలు సినిమాకు ప్లస్ అవుతాయని పేర్కొన్నారు. మరో ప్రేక్షకుడు మాత్రం సినిమా అనుకున్నంత రేంజ్లో లేదని, అంచనాలు చాలా ఎక్కువగా ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని కామెంట్ చేశారు. ఇంకొకరు మొదటి 20 నిమిషాలు అరాచకం అని పెట్టారు.. అయితే రామ్ చరణ్ అభిమానుల్లో చాలామంది మాత్రం సినిమాను ప్రశంసిస్తున్నారు. రామ్ చరణ్ నటన, ఆయన పాత్రలో చూపించిన అంకితభావం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని చెబుతున్నారు. కొందరు అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్నవి కేవలం ప్రీమియర్ షోల తర్వాత వచ్చిన తొలి స్పందనలు మాత్రమే. అసలు ఫలితం ఏమిటో ప్రేక్షకుల పూర్తి తీర్పు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. మిక్స్డ్ టాక్ మధ్య ‘పెద్ది’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. Also Read: Ranveer Singh Ban: ఇక సహించేది లేదు.. ఫిల్మ్ ఫెడరేషన్‌కు లీగల్ నోటీసులు పంపించిన హీరో రణ్వీర్ సింగ్ Also Read: Aamir Khan Gauri Wedding: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్..అతిథులుగా షారుక్, సల్మాన్! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook First half starts on a decent note but quickly slips into a routine and predictable narrative. The second half is where the film completely derails with stretched scenes, sluggish screenplay, and zero emotional connect. The biggest disappointment is the climax.… #Peddi : Very recent ga ochina info prakaram.. 2 sequences top classs untay anta.. 🔥🔥 Oka commercial cinema.. Eee range grounded content tho.. Eeyy director teyaledhu anta.. 🥵🥵 Last 15 mins will… — Deadly Tiger (@Deadly_Tiger_) June 3, 2026 First 25 mins worth raa ayya Bucchi babu #Peddi !! ARR nunchi ee mass sounding first time 👌 — Sir Jhon™ (@Sir_Jhon_Uncle) June 3, 2026 విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్,...