
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ex MP Madhu yaskhi goud wife injured in us: మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సతీమణి కారు ప్రమాదంకు గురయ్యారు. ఈ ఘటనలో కారు పలు మార్లు బోల్తా పడటం వల్ల రిబ్స్ విరిగినట్లు వైద్యులు తెలిపారు. మధు యాష్కీ దంపతులు తమ కూతూరు డా. గగనను ఎండీ కోర్సులో చేర్చించి వేర్వేరు కార్లలో న్యూయార్క్ వెళ్తుండగా డా. సుచి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారు అదుపు తప్పి పలుమార్లుపల్టీలుకొట్టింది. దీంతో యూఎస్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ ఎంపీ సతీమణిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మధుయాష్కీ గౌడ్ సతీమణి పక్కటెముకలు విరిగాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వర్షం కారణంగానే కారు అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. రేపు ఇండియాకు తిరిగి రావాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఘటన గురించి వెలుగులోకి రావడంతో తెలంగాన కాంగ్రెస్ నేతలు, అభిమానులు మాజీ ఎంపీ మధు యాష్కీకి ఫోన్ చేసి ఆయన సతీమణి ఆరోగ్యం ఏవిధంగా ఉందని అడిగి తెలుసుకుంటున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్...