
Parvathipuram Incident: పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెల్లంగి నెపంతో వెలగవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కొంత మంది హత్య చేశారు. హత్యపై మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ గ్రామానికి చెందిన వ్యక్తులు చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఇంటికొచ్చి తన అన్నయ్యను కొట్టుకుంటూ తీసుకెళ్లి, చంపి స్మశానంలో కాల్చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.