బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్ (DK Shivakumar) తొలి ప్రకటన చేశారు. విద్యార్థులకు శుభవార్త చెప్పారు. విద్యార్థి సారథి స్కీమ్ కింద పాఠశాలలు, కాలేజీల నుంచి పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థుల వరకూ అందరికీ ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తొలి క్యాబినెట్ సమావేశానంతరం ప్రకటించారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా సరే వెనుకాడమని చెప్పారు. రైతుల వలసలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు.

యువతను ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్ చేసుకుంటామని, 56,000 పోస్టుల భర్తీకి సంబంధించి వివిధ డిపార్టమెంట్లతో చర్చించి జాబ్ క్యాలెండర్ను త్వరలోనే విడుదల చేస్తామని డీకే శివకుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో ఎంప్లాయింమెంట్ ఎక్స్ఛేంజ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఉద్యోగాల కోసం అక్కడ పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 10,000 భారత్ జోడో యూత్ క్లబ్లు ఏర్పాటు చేస్తామని, క్రీడలు, యువనాయకత్వం, సామాజిక సామరస్యం పొంపొందించడం వీటి ముఖ్యోద్దేశమని, ఒక్కో అసోసియేషన్ను ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున గ్రాంట్ మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే