
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భద్రతను తగ్గించింది. ఇప్పటివరకు దాదాకు కల్పిస్తున్న అత్యున్నత 'జెడ్' కేటగిరీ భద్రతను 'వై' కేటగిరీకి కుదిస్తూ జూన్ 3న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో గంగూలీ భద్రతా సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గనుంది.'జెడ్' కేటగిరీ కింద గంగూలీకి దాదాపు 35 మంది సిబ్బంది, పైలట్ వాహనంతో సహా పటిష్ఠమైన భద్రత ఉండేది. తాజా నిర్ణయంతో 'వై' కేటగిరీ కింద కేవలం 3-4 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. వీరిలో ఇద్దరు సాయుధ అధికారులు గంగూలీకి సమీప భద్రతను పర్యవేక్షిస్తారు.పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పాలనలో పలువురు ప్రముఖులకు కేటాయించిన వీఐపీ భద్రతపై సమీక్ష చేపట్టింది. నిజమైన ముప్పు అంచనా ఆధారంగానే భద్రత కల్పించాలని, వనరులను హేతుబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ సమీక్షలో భాగంగానే గంగూలీ భద్రతను తగ్గించినట్లు తెలుస్తోంది. మరికొంతమంది ప్రముఖులు, టీఎంసీ నేతల భద్రతను కూడా ప్రభుత్వం సవరించింది.ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ, భద్రత తగ్గింపు నిర్ణయంపై ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భద్రతను తగ్గించింది. ఇప్పటివరకు దాదాకు కల్పిస్తున్న అత్యున్నత 'జెడ్' కేటగిరీ...