
తొలకరి వర్షానికే తొందర పడి విత్తనాలు వేయవద్దని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్లో పత్తిసాగు అధికంగా ఉంటుంది. గతేడాది 3.50 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఈ ఏడాది పెరిగే అవకాశం ఉంది. సీజన్ ప్రారంభం కావడంతో వర్షాలు వస్తాయనే ఆశతో కొందరు రైతులు ముందుగానే పత్తి విత్తనాలు విత్తుతున్నారు. రుతుపవనాలు రాకముందే తేలిక పాటి వర్షాలకు పొలాలు సిద్ధం చేసి విత్తనాలు వేయడంతో నష్టపోయే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నేల కనీసం 3 నుంచి 5 అంగుళాలు తడిసే వర్షం పడే వరకు వేచి చూడాలి బెజ్జూరు, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తొలకరి వర్షానికే తొందర పడి విత్తనాలు వేయవద్దని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్లో పత్తిసాగు అధికంగా ఉంటుంది. గతేడాది 3.50 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఈ ఏడాది పెరిగే అవకాశం ఉంది. సీజన్ ప్రారంభం కావడంతో వర్షాలు వస్తాయనే ఆశతో కొందరు రైతులు ముందుగానే పత్తి విత్తనాలు విత్తుతున్నారు. రుతుపవనాలు రాకముందే తేలిక పాటి వర్షాలకు పొలాలు సిద్ధం చేసి విత్తనాలు వేయడంతో నష్టపోయే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు, మూడు భారీ వర్షాలు కురిసి నేల చల్లబడిన తర్వాత విత్తనాలు విత్తుకోవాలని సూచిస్తున్నారు. నేల కనీసం 3 నుంచి 5 అంగుళాలు తడిసేలా వర్షం పడ్డాకే సాగు మొదలు పెట్టాలని అధికారులు చెబుతున్నారు. పొడి దుక్కుల్లో విత్తనాలు వేయడం వల్ల రైతు శ్రమ వృథా కావడమే కాకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా విత్తిన విత్తనాలు సక్రమంగా మొలకెత్తవు. మళ్లీ విత్తే పరిస్థితి ఏర్పడనుండటంతో ఖర్చు పెఓరగడంతో పాటు విత్తన కొరత ఏర్పడుతుంది. విత్తనాలు మొతకెత్తినా మొక్కల సాంద్రత తగ్గడం, సక్రమంగా ఎదగకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒక ఎకరం పత్తి విత్తనాలకు రూ.2వేల వరకు ఖర్చు వస్తుంది. వాటిని విత్తేందుకు కూలీలకు రూ.వెయ్యి, దుక్కిని సిద్ధం చేసేందుకు రూ.3వేల ఖర్చు అవుతుంది. సరైన వర్షాలు కురవక ముందే విత్తనాలు విత్తడంతో అవి సక్రమంగా మొతకెత్తకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవ డంతో పాటు శ్రమ వృథా అవుతుంది. రైతులు అధికారుల సూచనలు పాటించాలి. కొన్ని మండలాల్లో కొంతమేర వర్షాలు కురవగా, మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలే కురిశాయి. భూమిలో వేడి తగ్గలేదు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఒక అడుగులోతు వరకు భూమి అధిక వేడితో ఉంటుంది. పొలాలు, దుక్కులు చల్లబడాలంటే కనీసం 6 సెంటిమీటర్ల వర్షం అవసరం. ప్రస్తుతం 2 నుంచి 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వానాకాలం పంటల సాగుకు రైతులు కొన్ని రోజులు వేచి చూడాలని వ్యవ సాయ అధికారులు సూచిస్తున్నారు. అప్పటి వరకు దుక్కులను తగిన పద్ధతుల్లో చేసుకుని సాగుకు సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు. Home » Telangana » Just kidding.. don't rush. ABN , Publish Date - Jun 03 , 2026 | 10:17 PM తొలకరి వర్షానికే తొందర పడి విత్తనాలు వేయవద్దని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్లో పత్తిసాగు అధికంగా ఉంటుంది. గతేడాది 3.50 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఈ...