
వానాకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఎరువుల దుకాణా ల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నారు. ఎరువులతో పాటు విత్తనా ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులకు ఏ ఇబ్బంది కలుగకూడదని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్ ఆధ్వర్యంలో ఆయా డివిజన్లతో పాటు మండలాల్లో అధికారులు విస్త్రృతంగా పర్యటిస్తూ తనిఖీలు చేస్తున్నారు. కాగజ్‌నగర్ టౌన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఎరువుల దుకాణా ల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నారు. ఎరువులతో పాటు విత్తనా ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులకు ఏ ఇబ్బంది కలుగకూడదని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్ ఆధ్వర్యంలో ఆయా డివిజన్లతో పాటు మండలాల్లో అధికారులు విస్త్రృతంగా పర్యటిస్తూ తనిఖీలు చేస్తున్నారు. డివిజన్లలోని ఎరువులు, విత్తనాల స్టాకు, అమ్మకాల వివరాలు, ఇతరత్ర రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జిల్లాలోని 320 ఎరువుల దుకాణాలతో పాటు గ్రోమోర్, ఆగ్రో సెంటర్స్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తు అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువులు అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. రైతులకు ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని ఆయా డీలర్లు, దుకాణాల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయించకూడదని చెబుతున్నారు. రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలకు సంబంధించి రసీదులు ఇవ్వాలని ఆదేశాలు ఇస్తున్నారు. ప్రతీ రైతు లైసెన్సులు ఉన్న దుకాణాల్లోనే ఎరువులు, పురుగు మందులు ఇతరత్ర కొనుగోలు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. డీలర్ల వద్దకు వచ్చే రైతులకు లింక్ ప్రోడక్ట్స్, ఇతర వస్తువులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులకు కూడా నకిలీ విత్తనాలు, నాసిరకం వస్తువులు కొనుగోలు చేయరాదని సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు అందుబాటు లో ఎరువులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయాధికారి వెంకట్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు ఐదు లక్షల ఎకరాల పంటసాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కేవలం పత్తి పంటనే 4 లక్షల ఎకరాలు కాగా, వరి 50 వేలు, కంది 23 వేలు ఎకరాలతో పాటు కూరగాయలు, ఇతర జొన్న, మొక్కజొన్న పంటలు కూడా ఉంటాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు అంటున్నారు. ఎలాంటి కృత్రిమ కొరత సృష్టించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలోని అన్ని షాపులు, ధాన్యం కొనుగోలు సెంటర్లను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సీజన్లో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. డిఏపి 20 వేలు మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20 వేల మెట్రిక్ టన్నులతో పాటు పత్తి విత్తనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ దుకాణంలో స్టాకుల వివరాలు రైతులకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూ చించారు. వ్యాపారులు నిబంధనల మేరకు అమ్మకాలు చేయాలని, లేకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రైతులు వానాకాలం సీజన్‌కు సంబంధించిన యూరియా నిల్వలు, ఇతరత్ర పురుగు మందులు, పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఎమ్మార్పీ రేట్లకే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ రైతు కొనుగోలు చేసిన వెంటనే రసీదు తీసుకోవాలి. అలాగే లైసెన్సులు కలిగిన దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు, తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. ఽరైతులకు ఇబ్బం దులు లేకుండా ఉండేందుకు ఎరువుల కోసం ప్రత్యేక యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి. ఎరువుల దుకాణాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పడూ తనిఖీ చేస్తూ సూచనలు ఇస్తున్నాం. Home » Telangana » Inspections by agricultural officials begin.. ABN , Publish Date - Jun 03 , 2026 | 10:15 PM వానాకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఎరువుల దుకాణా ల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నారు. ఎరువులతో పాటు...