
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంల... పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Snake hiding and Drinking tap water amid summer heat season video: కొన్ని రోజులుగా ఎండలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. వడగాల్పుల ప్రభావంతో జనాలు ఇళ్లలో నుంచి బైటకు రావాలంటేనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. పొరపాటున కూడా ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బైటకు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ దెబ్బకు జనాలు మాత్రమే కాదు.. నోరులేని జీవాలు సైతం తెగ ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా పాముల గురించి సోషల్ మీడియాలో వీడియోలు,వార్తలు ఎక్కువగా వైరల్‌గా మారుతున్నాయి. పాములు కూడా ఎండ ప్రభావంకు సతమతమౌతున్నాయి. ఇవి పుట్టల్లో ఉండకుండా భానుడి ప్రతాపంకు ఇళ్లలోకి లేదా చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి దూరి దాక్కుంటున్నాయి. అందుకే ఇతర సీజన్ లలో కంటే సమ్మర్ లో పాములు ఎక్కువగా మానవ ఆవాసాల్లో బైటపడుతున్నాయి. ఇక ఎండల ప్రభావం నుంచి బైటపడేందుకు మనిషి ఎలాగైతే నీళ్లను ఎక్కువగా తాగుతాడో , చల్లని ప్రదేశాల్లో ఉంటాడో పాము కూడా అచ్చం అలానే ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక పాము వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా మారింది. ఇది ట్యాప్ ను చుట్టుకుని మరీ చిల్ అవుతుంది. ఎండల ప్రభావంకు నాగు పాము కుళాయిల దగ్గరకు వచ్చింది. ఏంచక్కా గోడ మీద పాకుతూ ఎక్కింది. ఆ తర్వాత దాన్ని చుట్టుకుని కుళాయి నుంచి వస్తున్న నీళ్ల కింద సేదతీరుంది. నీళ్లను తాగుతూ, స్నానం చేస్తు చిల్ అవుతుంది. దాన్ని చుట్టుపక్కల వారు చూశాడు. అక్కడి నుంచి పామును తరిమెద్దామని చూసిన కూడా అది బుసలు కొడుతూ వారి మీదకు పలు మార్లుకాటు వేయడానికి ప్రయత్నించింది. కానీ పాము మాత్రం అక్కడి నుంచి దిగిపోవడంకు ఇష్టపడేలేదు. చాలాసేపు అలానే నీళ్ల కింద కోబ్రా చల్లని నీళ్లకు సేదతీరింది. ఆ తర్వాత అక్కడున్న వారు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. అతను కుళాయి దగ్గరకు వచ్చి కాసేపు పామును మచ్చిక చేసుకుని దాన్ని ఎంతో చాకచక్యంగా పట్టుకుని దగ్గరలోని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. Read more: Cobra Video: పాము క్యూట్‌గా ఉందా..?.. లేక నేనా..?. ఉత్తచేతులతో కోబ్రాను పట్టుకుని యువతి హల్ చల్.. వీడియో.. ఈ ఘటనను కొంత మంది వీడియో తీశారు. దాన్ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరికొంత మంది పాపం.. కోబ్రా ఎండకు సేదతీరుతుందిగా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.