
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో ‘పెద్ది’ టీమ్ సందడి చేసింది. జూన్ 4న (Peddi Release Date) సినిమా విడుదల కానున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో రామ్‌చరణ్ (Ram Charan), జాన్వీకపూర్ (Janhvi Kapoor), శివ రాజ... ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో ‘పెద్ది’ టీమ్ సందడి చేసింది. జూన్ 4న (Peddi Release Date) సినిమా విడుదల కానున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో రామ్‌చరణ్ (Ram Charan), జాన్వీకపూర్ (Janhvi Kapoor), శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar), నిర్మాత సతీశ్ కిలారు తదితరులు పాల్గొన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘‘నాకు నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ పొందుతున్నందుకు భగవంతుడికి, మీకు ధన్యవాదాలు. రెండున్నరేళ్ల విరామం తర్వాత ‘పెద్ది’తో మళ్లీ తెరపైకి వస్తున్నా. ప్రాణం పెట్టి మరీ ఈ చిత్రంలో నటించా. రాసిపెట్టుకోండి.. ఈ సినిమా ది బెస్ట్ అవుతుంది. శివన్న (శివ రాజ్‌కుమార్) తండ్రిలాంటి వారు. ఇండియన్ సినిమా లెజెండ్ ఆయన. కన్నడ చిత్ర పరిశ్రమ చక్రవర్తి. ఆయనతో కలిసి పని చేయడంతో నా జన్మధన్యమైంది. మా కాంబినేషన్ (జాన్వీ కపూర్‌ని ఉద్దేశించి)ను ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. జాన్వీతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. అంకితభావంతో పని చేశారు. దర్శకుడు బుచ్చిబాబు లేనిదే ఈ సినిమా లేదు. ఈ చిత్రం విషయంలో మరో కీలక వ్యక్తి డైరెక్టర్ సుకుమార్. స్ఫూర్తినింపే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. బుచ్చిబాబు.. సుకుమార్ శిష్యుడనే సంగతి తెలిసిందే. ఈ సినిమా సమర్పకుల్లో సుకుమార్ ఒకరు. ‘‘నిజాయతీ, కష్టపడేతత్వం రామ్‌చరణ్‌ను ఈ స్థాయికి చేర్చాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల ఆశీస్సులు చరణ్ వెంటే ఉంటాయి. ఓ సినిమా ఈవెంట్లో చరణ్- ఆయన బాబాయ్ పవన్ మధ్య అనుబంధం నా హృదయాన్ని హత్తుకుంది. ఆ దృశ్యాలు చూడగానే పునీత్ రాజ్‌కుమార్‌తో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ‘పెద్ది’ టీమ్ ప్రేమను మర్చిపోలేను. ఈ సినిమాలో స్పోర్ట్స్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా ఉంది’’ అని శివ రాజ్‌కుమార్ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.