
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ... సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Petrol And Diesel Price Hike: 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లూటీదారు. దేశ ప్రజలను దోచడంలో మోడీని మించినోళ్లు లేరు. పెట్రోల్, డీజిల్ పేరుతో కేంద్ర ప్రభుత్వ దోపిడీ వాయిదాల పద్దతి. 10 రోజుల్లో వరుసగా నాలుగుసార్లు ఇంధనం ధరలు పెంచడం అత్యంత దారుణం' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రోజుకు రూ.వెయ్యి కోట్లు అదనపు భారం మోపుతున్నా మోడీ ఆకలి తీరలేదని ఇది సామాన్యుల సంపాదనను కాజేసి, పేదవారిని రోడ్డున పడేసి, దేశ ప్రజలకు బతుకు భారం చేసే కుట్ర' అని మండిపడ్డారు. ఇంధన సంక్షోభంపై సుంకాలు తగ్గించాల్సింది పోయి.. అదనంగా వడ్డించడం ప్రపంచ చరిత్రలో మోదీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఇంధనం ధరల భారం దృష్ట్యా ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ నిర్ణయాలు ప్రపంచానికి పాఠాలు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ప్రజలపై మొత్తం భారం వద్దని.. పెరిగిన భారాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భారాన్ని ప్రభుత్వం, రెండో భారం ఆయిల్ కంపెనీలు, మూడో భారాన్ని ప్రజలపై అతి తక్కువగా వేశారు' అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. 'నేడు నష్టాల పేరు చెప్పి పూర్తి భారాన్ని ప్రజలపై రుద్దడం మోడీ దుర్మార్గపు పాలనకు నిదర్శనం. చమురు ధరలు తగ్గినప్పుడు లాభం పొంది.. ధరలు పెరిగాయని జనాలను దోచుకోవడం కేంద్ర ప్రభుత్వ నీచపు చర్యలకు అద్దం పడుతోంది' అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'నాలుగోసారి పెరిగిన ధరలతో ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ లీటర్ ధర రూ.104.88 పైసలకు చేరుకుంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు అధికం. రాష్ట్ర ప్రజలపై మోదీ సర్కార్ భరించలేని భారం మోపుతుంటే చంద్రబాబు మౌనం వహించడం సిగ్గుచేటు' అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతున్నా పట్టింపు లేకపోవడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రంలో అధికంగా వసూలు చేస్తున్న రూ.4 వ్యాట్, ఒక్క రూపాయి రోడ్డు సెస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంధనం ధరలపై కొంత ఉపశమనం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. ఏపీలో కూడా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. స్వయంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమంలో షర్మిల పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై స్పందన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జనసేన పార్టీ నాయకులు చేస్తున్న దాడి.. కేసులపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 'ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు పెట్టి వేధించడం దారుణం. ఇది కూటమి ప్రభుత్వానికి తగదు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాక కూడా కేసులు బనాయించడం సరికాదు. ఇది కక్ష్య పూరిత ధోరణికి నిదర్శనం' అని తెలిపారు. తక్షణం నాగేశ్వర్ గారిపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.