
Home » Andhra Pradesh » Guntur » YS Jagan Honeymoon Leader Says AP Minister Ramprasad Reddy Over Corruption Allegations Against YSRCP VVNP ABN , Publish Date - May 25 , 2026 | 05:37 PM వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగ... వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి హనీమూన్ నాయకుడని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివర్ణించారు. పాత సారాని కొత్త సీసాలో నింపి మార్కెటింగ్ చేసినట్లు వైఎస్ జగన్ వ్యవహారం ఉందన్నారు. అమరావతి, మే 25: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి హనీమూన్ నాయకుడని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివర్ణించారు. పాత సారాని కొత్త సీసాలో నింపి మార్కెటింగ్ చేసినట్లు వైఎస్ జగన్ వ్యవహారం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఓర్వలేక నిత్యం అక్కసు వెళ్లగక్కుతున్నాడంటూ జగన్‌పై ఆయన మండిపడ్డారు. సోమవారం రాజధాని అమరావతిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. విజయలక్ష్మి మినరల్స్‌తో మైనింగ్ దోపిడీ ప్రారంభించి.. భారతీ సిమెంట్స్, సండూర్ పవర్ వరకూ విస్తరించారని వివరించారు. దోపిడీ, బెదిరింపులు, మోసం చేసి.. సంపాదించిన నగదును రాజకీయాల్లో పెట్టి ఎదిగారని చెప్పారు. బలపనూరు నుంచి ప్రారంభమైన వైఎస్ కుటుంబ ప్రస్థానం రూ. లక్షల కోట్ల అవినీతి సామ్రాజ్యంగా విస్తరించిందని రవాణా శాఖ మంత్రి పేర్కొన్నారు. చెల్లని రూపాయిగా మారిన వైఎస్ జగన్‌ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. జగన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తే.. వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అనే రీతిలో మహానాడు ప్రారంభం రోజు వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిందని వ్యంగ్యంగా అన్నారు. వైఎస్ జగన్ నిర్వహించే ఈ కార్యక్రమం మహానాడుకు దిష్టిచుక్క లాంటిదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..