
LIC Joint plans | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు కొత్త పాలసీలను తీసుకొచ్చింది. భార్యాభర్తలిద్దరికీ బీమా అందించేలా రెండు జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్... LIC Joint plans | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు కొత్త పాలసీలను తీసుకొచ్చింది. భార్యాభర్తలిద్దరికీ బీమా అందించేలా రెండు జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. బీమా+ పొదుపు మిళితంగా న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం పేరిట రెండు పాలసీలను ఆవిష్కరించింది. జూన్ 1 నుంచి ఈ పాలసీలు కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి. ఒకప్పుడు ఇంట్లో పురుషులకు మాత్రమే బీమా పాలసీ తీసుకునేవారు. చాలా కుటుంబాల్లో స్త్రీలు కూడా కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ భార్యాభర్తలిద్దరూ కలిపి ఒకే పాలసీ తీసుకోవాలని అనుకునే వారి కోసం ఈ ప్లాన్లను ఎల్ఐసీ డిజైన్ చేసింది. బీమా హామీతో పాటు కట్టిన సొమ్ముకు గ్యారెంటీడ్ అడిషన్ (GA) కింద కొంత మొత్తం అదనంగా చెల్లిస్తారు. మెచ్యూరిటీ బెన్ఫిట్ కూడా లభిస్తుంది. ఉదాహరణకు: ఒక 35 ఏళ్ల భర్త (ప్రైమరీ) తన 32 ఏళ్ల భార్య (సెకండరీ)తో కలిసి Option Iని ఎంచుకుని, పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు, బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.10 లక్షలతో పాలసీ తీసుకున్నారనుకుందాం. సింగిల్ ప్రీమియం కింద సుమారు రూ.8 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు భర్తకు రిస్క్ జరిగితే ఆప్షన్ 1 ప్రకారం రూ.10 లక్షలు సర్వైవింగ్ భార్యకి చెల్లిస్తారు. పాలసీ మున్ముందూ కొనసాగుతుంది. భార్యకు కూడా రిస్క్ జరిగితే సమ్ అష్యూర్డ్+ అప్పటి వరకు యాడ్ అయిన గ్యారెంటీడ్ అడిషన్ కలిపి నామినీకి చెల్లిస్తారు. ఒకవేళ 20 ఏళ్లకు ఇద్దరికీ ఎలాంటి రిస్కూ జరగకపోతే బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ అడిషన్ కలిపి రూ.24 లక్షలు చెల్లిస్తారు. మధ్యలో ఎప్పుడైనా రుణం కూడా తీసుకోవచ్చు. యాక్సిడెంటల్, క్రిటికల్ ఇల్నెస్ వంటి రైడర్లు కూడా జోడించొచ్చు. మరిన్ని వివరాలకు ఎల్ఐసీ సేల్స్ బ్రోచర్‌ను చదవండి ఉదాహరణకు ఒక 35 ఏళ్ల భర్త, తన 32 ఏళ్ల భార్యతో కలిసి ఆప్షన్-Iని ఎంచుకుని, పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు, ప్రీమియం చెల్లించే కాలవ్యవధి 10 సంవత్సరాలు ఎంచుకున్నారనుకుందాం. బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.10 లక్షలు తీసుకుంటే వార్షిక ప్రీమియం కింద ఏడాదికి రూ.1.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 10 ఏళ్లలోపు భర్తకు రిస్క్ జరిగితే ఆప్షన్ I కింద డెత్ బెనిఫిట్‌ను భార్యకు చెల్లిస్తారు. మిగిలిన ప్రీమియాలు మాఫీ అవుతాయి. పాలసీ కొనసాగుతుంది. రెండో వ్యక్తికి కూడా రిస్క్ జరిగితే సమ్ అష్యూర్డ్+ గ్యారెంటీడ్ అడిషన్లు నామినీకి చెల్లిస్తారు. ఒకవేళ 20 సంవత్సరాలు పాలసీదారులకు ఎలాంటి రిస్కూ జరగకపోతే మెచ్యూరిటీ కింద సమ్ అష్యూర్డ్ రూ.10 లక్షలు, గ్యారెంటీ అడిషన్ రూ.18 లక్షలు కలిపి రూ.28 లక్షలు చెల్లిస్తారు. పాలసీ ఫోర్స్‌లో ఉన్న సమయంలో రుణ సదుపాయం ఉంది. యాక్సిడెంటల్, క్రిటికల్ ఇల్నెస్, టర్మ్ అష్యూరెన్స్ రైడర్స్ జోడించొచ్చు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.