
ఈనాడు, అమరావతి: వేసవి వచ్చిందంటే ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు ఊపందుకుంటాయి. భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందడానికి వివిధ ఫ్లేవర్లలో దొరికే ఐస్‌క్రీమ్‌లను లాగించేస్తుంటారు. అయితే, ఇలా కనిపించే ప్రతీది ఐస్‌క్రీమ్ కాదనే విషయం తె... ఈనాడు, అమరావతి: వేసవి వచ్చిందంటే ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు ఊపందుకుంటాయి. భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందడానికి వివిధ ఫ్లేవర్లలో దొరికే ఐస్‌క్రీమ్‌లను లాగించేస్తుంటారు. అయితే, ఇలా కనిపించే ప్రతీది ఐస్‌క్రీమ్ కాదనే విషయం తెలుసా? వాటినే ఫ్రోజెన్ డెజర్ట్ అని అంటారు. ఈ రెండూ చూడడానికి, రుచిలో ఒకే విధంగా ఉంటాయి. కానీ, వీటి తయారీలో వాడే పదార్థాలు వేరు. ఐస్‌క్రీమ్‌లు, కుల్ఫీలను పాలు, పాల పదార్థాలతో తయారుచేస్తారు. ఫ్రోజెన్ డెజర్ట్‌లో మాత్రం వెజిటేబుల్ ఫ్యాట్ లేదా పామాయిల్ ఉపయోగిస్తారు. అందుకే ఎఫ్ఎస్ఎస్ఏఐ దీన్ని ఫ్రోజెన్ డెజర్ట్‌గా వర్గీకరించింది. ఐస్‌క్రీమ్‌తో పోలిస్తే సుమారు 50 శాతం వరకు ఫ్రోజెన్ డెజర్ట్ ధర తక్కువగా ఉంటుంది. కానీ, వివిధ కంపెనీలు దీన్ని.. ఐస్‌క్రీమ్‌లా అధిక ధరకు విక్రయిస్తున్నాయి. ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డెజర్ట్ తయారీలో ప్రమాణాలు, నిబంధనలను ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిర్దేశించింది. దీని ప్రకారం ప్యాకింగ్, లేబులింగ్‌పై తయారీ అంశాలు స్పష్టంగా ఉండాలి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.