
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ... సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Sudden Rain In Hyderabad: వేసవికాలం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండడంతో హైదరాబాద్ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఎండి వేడిమితోపాటు ఉక్కపోతతో అలాడుతున్న హైదరాబాద్‌వాసులకు సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఊరట చెందారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఉదయం నుంచి ఎండలు మండుతూ ఉక్కపోతగా ఉండగా.. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వాతావరణం మారిపోయింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, నాగోల్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్పేట్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ భారీ వర్షంతో హైదరాబాద్ నగర ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. Also Read: YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు మహబూబ్‌నగర్ జిల్లాలో.. భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం మహబూబ్‌నగర్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఈ వర్షంతో రైతులకు అపార నష్టం కలిగించింది. వర్షం ధాటికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, మిడ్జిల్ మండలాలలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీస్తూ భారీ వర్షం కురవడంతో అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షం కారణంగా జడ్చర్ల పట్టణంలో పలు కాలనీలు జలమయంగా మారి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన బలమైన గాలులు వీయడంతో జడ్చర్ల మార్కెట్ యార్డులో మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం ధాటికి భారీ వృక్షాలు రోడ్లపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ వర్షం ధాటికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ఏర్పాటుచేసిన లక్షల రూపాయల విలువైన సోలార్ ప్యానల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిడ్జిల్ మండలంలోని చేతికి వచ్చిన పంట పొలాల గాలి బీభత్సానికి నేలకొరిగాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అపార నష్టాన్ని మిగిల్చింది. Also Read: KKR vs DC: ఆఖరి మ్యాచ్‌లో కలకత్తాపై ఢిల్లీ విజయం.. ముగిసిన ఐపీఎల్ 2026 లీగ్ దశ తడిసిన ధాన్యం కామారెడ్డి జిల్లాలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు తడిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లో ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షానికి వరి ధాన్యం రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం తాటికి ధాన్యంపై కప్పిన కవర్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది.