
Home » South Cinema » cm vijay allows five shows for movies in tamil nadu rcb ABN , Publish Date - May 25 , 2026 | 07:35 PM తమిళ సినీ ఇండస్ట్రీపై సీఎం విజయ్ వరాల జల్లు కురిపించారు. ఎవరి అనుమతి లేకుండానే ఇకపై రాష్ట్రవ్య... తమిళ సినీ ఇండస్ట్రీపై సీఎం విజయ్ వరాల జల్లు కురిపించారు. ఎవరి అనుమతి లేకుండానే ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో 5 షోల ప్రదర్శనకు ఓకే చెబుతూ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళ సినీ ఇండస్ట్రీపై సీఎం విజయ్ (Tamil Nadu CM Vijay) వరాల జల్లు కురిపించారు. కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు మే 16వ తేదీన సీఎం విజయ్‌ని కలిసి తమ అభ్యర్థలను సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో తమిళనాడు అంతటా ఉన్న థియేటర్లలో అన్ని సినిమాలకు రోజుకు ఐదు ప్రదర్శనలు ప్రదర్శించడానికి అనుమతించాలని వారు కోరారు. చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమర్పించిన ఈ అభ్యర్థనపై సీఎం విజయ్ సంప్రదింపులు జరిపిన అనంతరం, తమిళనాడు సినిమా థియేటర్ల నిబంధనలలో సవరణలకు ఓకే చెప్పారు. ఈ సవరణల ప్రకారం, తమిళనాడులోని అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు, విడుదలైన రోజు నుంచి ఏడు రోజుల పాటు రోజుకు ఐదు షో వేసుకోవడానికి.. అలాగే స్థానిక పండుగ రోజులు, సాధారణ సెలవు దినాలు, శనివారం, ఆదివారాల్లో.. రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతులు ఇస్తూ సీఎం విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. 1957 తమిళనాడు సినిమా థియేటర్ల (నియంత్రణ) నిబంధనల ప్రకారం, థియేటర్లకు జారీ చేసే లైసెన్స్ నిబంధన 14-A కింద ప్రస్తుతం తమిళనాడులోని అన్ని థియేటర్లలో రోజుకు నాలుగు ప్రదర్శనలు మాత్రమే ప్రదర్శిస్తున్నారు. అలాగే స్థానిక పండుగ రోజులు లేదా సాధారణ ప్రభుత్వ సెలవు దినాల్లో, పైన పేర్కొన్న నాలుగు ప్రదర్శనలతో పాటు అదనంగా ఒక ప్రత్యేక ప్రదర్శన.. అంటే రోజుకు ఐదు ప్రదర్శనలు వేసుకోవడానికి, జిల్లాల్లో అయితే లైసెన్స్ జారీ చేసే అధికారి/జిల్లా కలెక్టర్.. చెన్నై నగరంలో అయితే సిటీ పోలీస్ కమిషనర్ అనుమతి ఇస్తూ వస్తున్నారు. కానీ ఇకపై ప్రభుత్వం అలాగే, లైసెన్స్ జారీ చేసే అధికారి నుంచి ప్రత్యేకంగా ఎలాంటి అనుమతి తీసుకోనవసరం లేదని తెలుపుతూ డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో సినీ ప్రముఖులంతా విజయ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముగిసిన సమావేశం.. ఎగ్జిబిటర్స్ సమస్యలు విని చిరంజీవి ఆశ్చర్యం! హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు 10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?