
Pawan Kalyan: రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి అని పవన్ ప్రశ్నించారు. ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడ... Pawan Kalyan: రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి అని పవన్ ప్రశ్నించారు. ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని క్వశ్చన్ చేశారు. వైసీపీ నాయకులు జైలుకి వెళ్లాలని నేను ఎందుకు కోరుకుంటాను? అని పవన్ అన్నారు. ఒకరు జైలుకి వెళ్తే పవన్, జనసేన ఎదుగుతుందా? అని అన్నారు. నేను పదే పదే కులం గురిచి మాట్లాడతానని అంటున్నారు. నేను ఎప్పుడైనా కుల నాయకుడినని చెప్పానా? మిగతా నాయకులు కులం గురించి మాట్లాడటం లేదా? కులాలను రెచ్చగొట్టడం మంచిది కాదు అని పవన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అన్నీ భరించా, ఇకపై భరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మాకూ కోపాలు, బాధలు ఉంటాయి.. చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దని స్పష్టం చేశారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందన్న పవన్.. రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. కష్టాలు, కన్నీళ్లు మీకే ఉంటాయా? అని అన్నారు. ఇకపై జనసేన కార్యాచరణ చాలా బలంగా ఉంటుందని రాజమండ్రిలో జనసేనత నేతలతో జరిగిన మీటింగ్ లో పవన్ కల్యాణ్ అన్నారు.