
Home » Andhra Pradesh » Guntur » Pawan Kalyan Makes Key Remarks at Jana Sena Meeting Says Tamil Nadu Politics Ran Smoothly Sj ABN , Publish Date - May 25 , 2026 | 07:59 PM ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధిన... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. అమిత్ షాతో భేటీ, వైసీపీపై ఆరోపణలు, పార్టీ అంతర్గత పరిస్థితులు, కుల రాజకీయాలపై ఆయన ఘాటుగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ డెస్క్: జనసేన పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కుల రాజకీయాలు, ప్రత్యర్థి పార్టీల విమర్శలు, పార్టీ అంతర్గత పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాజకీయాలు చాలా సాఫీగా సాగిపోయాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అక్కడి రాజకీయాలను చూస్తే అసూయ కలిగేంత సులభంగా జరిగాయని అన్నారు. తాను పదేపదే కులం గురించి మాట్లాడుతున్నానని కొందరు విమర్శిస్తున్నారని పేర్కొన్న పవన్, 'నేను ఎప్పుడైనా కుల నాయకుడినని చెప్పానా? మిగతా పార్టీ నేతలు కులం గురించి మాట్లాడటం లేదా?' అంటూ ప్రశ్నించారు. కులాలను రెచ్చగొట్టే మనస్తత్వం సమాజానికి మంచిది కాదని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన చర్చలపై కూడా ఆయన స్పందించారు. 'నేను అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి? ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు?' అని ప్రశ్నించారు. వైసీపీ నేత జైలుకెళ్లాలని నేను ఎందుకు కోరుకుంటాను? ఒక నాయకుడు జైలుకెళ్తే జనసేన ఎదుగుతుందా? అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రితో రాష్ట్ర అభివృద్ధి అంశాలపైనే మాట్లాడుతాం.. ఇలాంటి ఆరోపణలు చేయడం వ్యవస్థను అవమానపరచడమేనని పవన్ అన్నారు. తాను అమిత్ షాను కలిసింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. 'నేను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. శత్రువు బలంగా ఉన్నప్పుడే ఎదుర్కొంటా.. బలహీనులను కాదు' అని వ్యాఖ్యానించారు. 'మాకు కూడా కోపాలు, బాధలు ఉంటాయి. చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది.. భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాట తీస్తాం' అంటూ పవన్ హెచ్చరించారు. పదవులు వచ్చిన తర్వాత చాలా మంది జనసేన నాయకులు మెత్తబడిపోయారని, అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదని స్పష్టం చేశారు. 'మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు. శత్రువులు బయట ఎక్కడో లేరు.. మన పార్టీలోనే ఉన్నారు' అంటూ పార్టీ నేతలకు పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనలో ఉండగలిగేవాళ్లు మాత్రమే పార్టీలో ఉండండి అని స్పష్టం చేశారు. 'నేను టీడీపీ కోసం కాదు.. రాష్ట్రం కోసం సర్దుకుపోతున్నా' అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇకపై జనసేన కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని, వ్యక్తిగతంగా విమర్శిస్తే అదే స్థాయిలో బదులిస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్పై చర్చ..