
ఇంటర్నెట్ డెస్క్: మెటా తన యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్స్టంట్ పేరుతో యాప్‌ను తీసుకురాగా.. తాజాగా రెడ్డిట్ తరహాలో ఫోరమ్ (Facebook forum) అనే స్టాండ... ఇంటర్నెట్ డెస్క్: మెటా తన యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్స్టంట్ పేరుతో యాప్‌ను తీసుకురాగా.. తాజాగా రెడ్డిట్ తరహాలో ఫోరమ్ (Facebook forum) అనే స్టాండలోన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్బుక్ గ్రూపులు, కమ్యూనిటీ యూజర్లే లక్ష్యంగా దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది. నచ్చిన అంశాలపై చర్చించేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫేస్బుక్ అకౌంట్ ద్వారానే ఫోరమ్ యాప్‌లోనూ లాగిన్ అవ్వొచ్చు. ఇప్పటికే ఫేస్బుక్ గ్రూప్‌లను వాడుతున్న వినియోగదారులకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫేస్బుక్ గ్రూపుల్లో నిక్నేమ్తోనూ పోస్టులు చేసే సదుపాయం ఉంది. ఏదైనా కావాల్సిన అంశంపై సమాచారం తెలుసుకునేందుకు ఏఐ ఆస్క్ ట్యాబ్, ఏఐ అసిస్టెంట్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆసక్తికర విషయాలు, స్థానిక అంశాలు, అభిరుచులు వంటి విషయాలపై గ్రూప్స్‌లో చర్చించే సదుపాయం ఉంది . ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని ఎంపిక చేసిన కొంతమంది ఐఓఎస్ యూజర్లకు ప్రయోగత్మకంగా తీసుకొచ్చింది. దశలవారీగా అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.