
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వీరిది అత్యుత్తమ బ్యాటింగ్ జోడీ అని ప్రశంసలు కురిపించాడు. ‘‘శుభ్... ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వీరిది అత్యుత్తమ బ్యాటింగ్ జోడీ అని ప్రశంసలు కురిపించాడు. ‘‘శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటింగ్ జోడీ. వారిద్దరూ కలిసి 46 ఇన్నింగ్స్‌లు ఆడారు. 21 సార్లు 50 పరుగుల కంటే భాగస్వామ్యాలను నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది వేగవంతమైనది. ఓపెనింగ్ జోడీగా గిల్, సుదర్శన్‌ల నిలకడ అద్భుతం. వారు తమ ఇన్నింగ్స్‌ను నిర్మించుకోవడానికి తగిన సమయం తీసుకుంటారు. డాట్ బాల్స్ తక్కువ ఉండేలా చూసుకుంటారు. ప్రత్యేకంగా కొంతమంది బౌలర్లను లక్ష్యంగా చేసుకుని ఆడతారు. ఒకరు బౌలర్ వేగాన్ని ఉపయోగించుకుని పరుగులు రాబడితే మరొకరు షాట్లు ఆడతారు. వారిద్దరూ చాలా ఫిట్‌గా ఉన్నారు. ఆటపై అవగాహన అద్భుతంగా ఉంది. ఏ షాట్లు ఆడాలి, ఎప్పుడు అటాక్ చేయాలి అనే విషయం వారికి బాగా తెలుసు. నిలకడగా పరుగులు రాబట్టడమే వారి అతిపెద్ద బలం. ఈ సీజన్ ఐపీఎల్లో మరే ఇతర బ్యాటింగ్ జోడీ కూడా గిల్, సుదర్శన్ స్థాయి నిలకడను అందుకోలేకపోయింది’’ అని రైనా పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సుదర్శన్ (638), గిల్ (616) టాప్-2లో ఉన్నారు. మే 26న ఆర్సీబీ, గుజరాత్ మధ్య క్వాలిఫయర్-1 జరగనున్న విషయం తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. టీ20 మ్యాచ్‌లో 200 పరుగులు చేయడమే తన టార్గెట్ అని టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.