
ఇటీవలి కాలంలో పలు సంస్థలు లేఆఫ్‌లు ప్రకటించడం సాధారణమైంది. టెక్ దిగ్గజం మెటా సంస్థ కూడా ఇటీవలే కొంతమంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. ఇలా ఉద్యోగాలు కోల్పోయినప్పుడు దిగులు చెందడం సాధారణం. ఇటీవలి కాలంలో పలు సంస్థలు ల... ఇటీవలి కాలంలో పలు సంస్థలు లేఆఫ్‌లు ప్రకటించడం సాధారణమైంది. టెక్ దిగ్గజం మెటా సంస్థ కూడా ఇటీవలే కొంతమంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. ఇలా ఉద్యోగాలు కోల్పోయినప్పుడు దిగులు చెందడం సాధారణం. అయితే దానివల్ల ఫలితం ఉండదని, అందుకు బదులుగా తమ ఆసక్తులు, నైపుణ్యాలపై దృష్టి సారించాలని; చెబుతున్నారు నిపుణులు. తద్వారా తమకు నచ్చిన కెరీర్‌ను తిరిగి నిర్మించుకోవచ్చని సూచిస్తున్నారు. నేను కూడా ఇదే చిట్కాను పాటిస్తున్నానని చెబుతోంది భారత్‌కు చెందిన ఆశా రావల్. మెటా ప్రకటించిన లేఆఫ్‌ల జాబితాలో ఆశా కూడా ఉంది. ఈ క్రమంలోనే కెరీర్‌ను పునర్నిర్మించుకునే అవకాశంగా దీనిని భావిస్తానని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘మెటా తొలగించిన ఉద్యోగుల్లో నేను కూడా ఒకదాన్ని. నిజం చెప్పాలంటే ఒకరకంగా ఇప్పుడు విముక్తి కలిగినట్లుగా అనిపిస్తుంది. మెటాలో నాలుగేళ్ల పాటు అంచనాలకు మించి పని చేశా. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఎప్పుడైతే మనల్ని మనం నెమ్మదిగా కోల్పోతున్న భావన కలుగుతుందో.. అప్పుడు కెరీర్ పరంగా ఎన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నప్పటికీ ఆ వెలితిని పూడ్చలేం. నా విషయానికొస్తే.. ఈ టెక్ ప్రపంచం, కార్పొరేట్ టైటిళ్లు, సిలికాన్ వ్యాలీ కంటే ముందు నేను ఒక ఆర్టిస్ట్‌ని.. ఫ్యాషనిస్టాని.. వ్యాపారవేత్తని.. క్రియేటర్‌ని.. అయితే ఉద్యోగ బాధ్యతల కారణంగా వీటన్నిటినీ పక్కన పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు నా సానుకూలతలపై, నాకున్న ఇతర నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నా. నాకు అభిరుచి ఉన్న ఫ్యాషన్, ఆర్ట్, స్టోరీ టెల్లింగ్, ఆంత్రప్రెన్యూర్షిప్లను కలగలిపి సరికొత్త ‘ఆశా మోడ్’లోకి వెళుతున్నా. నేను itsfynd అనే ఫ్యాషన్ ఏఐ స్టార్టప్‌కు ఫౌండింగ్ క్రియేటర్‌గానూ పనిచేస్తున్నా. ఇది నా ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. ఇందులో సృజనాత్మకత, టెక్నాలజీ, ఫ్యాషన్, ఫ్యూచర్ అన్నీ ఉన్నాయి. ఈక్రమంలోనే ఒక విషయాన్ని అర్థం చేసుకున్నా.. కొన్నిసార్లు మనం సురక్షితమనుకునే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చినా దిగులు చెందకూడదు. దాన్ని మనకుండే అభిరుచులను, కలలను నెరవేర్చుకోవడానికి వచ్చిన చక్కటి అవకాశంగా భావించాలి. ప్రత్యామ్నాయ కెరీర్‌ని నిర్మించుకోవాలి. ఈ క్రమంలో మీరు ఉద్యోగం చేస్తూ ఏవైనా కలలు కంటుంటే వాటిని కొనసాగించండి.. నెరవేర్చుకోవడానికి కృషి చేయండి..’ అంటూ ఇతరుల్లోనూ స్ఫూర్తి నింపుతోంది ఆశా. అలాగే కేవలం ఉద్యోగం పైన ఆధారపడడమే కాకుండా ఇతర నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.. వింటున్నారా మరి! గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics.