
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగా... అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. 8th Pay Commission Pension Scheme: 8వ వేతన సంఘం అప్డేట్స్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త పే కమిషన్‌లో శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందోనని అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఇక జాతీయ పింఛను వ్యవస్థ (NPS) స్థానంలో పాత పింఛను పథకం (OPS)ను తీసుకురావాలని ఎంప్లాయిస్ యూనియన్లు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 8వ వేతన సంఘం నేపథ్యంలో ఈ డిమాండ్సై మరోసారి చర్చలు ఊపందుకున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవకచ్చని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎన్పీఎస్ అమలులోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తయింది. ఈ సమయంలో ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి వచ్చిన విరాళాల ద్వారా వ్యవస్థలో రూ.16.5 లక్షల కోట్లకు పైగా జమ అయ్యాయి. ఈ డబ్బును LIC, SBI, UTI వంటి ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా స్టాక్ మార్కెట్, ప్రభుత్వ బాండ్లు, వివిధ కార్పొరేట్ సాధనాలలో ఇన్వెస్ట్ చేశారు. ఇలాంటి తరుణంలో మళ్లీ ఓపీఎస్‌కు వెళితే.. ఈ భారీ మొత్తంలో డబ్బును మార్కెట్ నుంచి హఠాత్తుగా ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. దీంతో స్టాక్, బాండ్ మార్కెట్లలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ద్రవ్య సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే ఇప్పుడు అనేక ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తమ డిమాండ్‌లో స్వరం మారుస్తున్నారు. ఓపీఎస్‌ను తిరిగి తీసుకురావడం గురించి మాట్లాడటమే కాకుండా.. ప్రస్తుతం ఉన్న ఎన్పీఎస్ లేదా ఏకీకృత పింఛను పథకం (యూపీఎస్) పరిధిలోనే 'ఓపీఎస్ లాంటి హామీలను' కూడా ఉండాలని కోరుతున్నారు. ఉద్యోగులకు జీవితాంతం 100% సురక్షితమైన, ద్రవ్యోల్బణం లేని భవిష్యత్‌కు ఓపీఎస్ హామీ ఇస్తుంది. OPS కింద పెన్షన్ ప్రయోజనాల కోసం వారి జీతం నుంచి ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు. పెన్షన్ మొత్తాన్ని కేంద్రమే బడ్జెట్ నుంచి కేటాయించేది. ఇప్పుడు NPS లేదా UPS కింద, ఉద్యోగులు ప్రతి నెలా తమ మూల వేతనంలో 10 శాతాన్ని పింఛను నిధికి చెల్లించాల్సి వస్తోంది. తాము కష్టపడి సంపాదించిన డబ్బు నుంచి ఈ కోత విధించడం సరికాదని ఉద్యోగులు భావిస్తున్నారు. OPS కింద.. ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యాన్ని (DA) పెంచుతుంది. అయితే NPS కింద అలా జరగదు. అందుకే ఉద్యోగులు ఎక్కువ మంది తమకు ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరుతున్నారు. మరీ ప్రభుత్వం కొత్త పే కమిషన్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదో చూడాలి మరి. Also Read: Prabhas New House: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్.. రెండు ఎకరాల్లో డ్రీమ్ హౌస్.. ఎన్ని వందల కోట్లో తెలుసా? Also Read: Hyderabad Real Estate: ప్రగతినగర్,నిజాంపేట్‌లో అమ్ముడుపోని ప్లాట్లు.. కొనేవారు లేక కొట్టుమిట్టాడుతున్న రియాల్టర్లు..!!