
ఇంటర్నెట్ డెస్క్: కర్నూలు రేంజ్ డీఐజీ డా. ప్రవీణ్ కోయ అమెరికాలో పర్యటిస్తున్నారు. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో పలువురు ఎన్ఆర్ఐలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. తెలుగు కుటుంబాలకు చెందిన వంద మందికి పైగా ఈ కార్యక్రమాని... ఇంటర్నెట్ డెస్క్: కర్నూలు రేంజ్ డీఐజీ డా. ప్రవీణ్ కోయ అమెరికాలో పర్యటిస్తున్నారు. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో పలువురు ఎన్ఆర్ఐలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. తెలుగు కుటుంబాలకు చెందిన వంద మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. ప్రవీణ్ కోయ సేవలను కొనియాడారు. ఎన్ఆర్ఐలు తనపై చూపించిన అభిమానానికి డీఐజీ సంతోషం వ్యక్తం చేశారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీఏజీసీఏ, టీటీఏ, తానా సభ్యులతో పాటు ఎన్ఆర్ఐ తెదేపా నేతలు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.