
రాజమహేంద్రవరం: అన్నీ పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్... రాజమహేంద్రవరం: అన్నీ పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే.. తామూ ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. తనను విమర్శించే వాళ్లు రాగలరా అని ప్రశ్నించారు. ‘‘ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి.. నేను సిద్ధం. ఛాయిస్ మీకే ఇస్తున్నా.. అంతేగానీ నన్ను రెచ్చగొట్టొద్దు’’ అని వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో జనసేన నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడారు. ‘‘జగన్‌ను జైలుకు పంపాలని నేను కోరినట్లు ఓ విశ్లేషకుడు చెప్పడంలో ఉన్న లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. జగన్ జైలుకు వెళ్తే నాకు లాభం చేకూరుతుందనడం పిచ్చి లాజిక్. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు నేను ప్రయత్నిస్తే సీఎం అయ్యేవాడిని కదా? నా సిద్ధాంతం అది కాదు. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతా.. బలహీనంగా ఉన్నప్పుడు కొట్టను. విశ్లేషించే వారిని ప్రశ్నిస్తే.. కులం కార్డును పట్టుకొస్తామంటే ఎలా? ఇష్టానుసారం మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా.. మాకు కోపం రాదా? కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నామని అనుకుంటున్నాయి. దీటుగా మేం ఎదురుదాడి చేస్తాం.. మీరు వ్యక్తిగతంగా అంటే.. మేమూ అంటాం. ఛాయిస్ ఈజ్ యువర్స్. మితిమీరిన సహనం చేతగానితనం అయిపోతుంది. మౌనంగా ఉన్నానంటే.. మెత్తగా ఉన్నానని కాదు.. గట్టిపడుతున్నానని అర్థం. సరైన సమయం కోసం చూస్తున్నా.. అంతే కానీ బలహీనత కాదు. పార్టీ నడపాలంటే క్రమశిక్షణ కావాలి. అలా ఉంటే తప్ప కూటమిలో బలం రాదని గుర్తించాలి. జనసేన నేతలు పదవులు ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తారనుకుంటే.. మాట్లాడటం మానేశారు. పదవులు ఇవ్వగానే అందరూ పెద్దమనుషులు అయ్యారు. పదవుల కోసమే అయితే జనసేనలో ఉండాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి జనసేన జెండా పట్టుకుని చిన్నారితో ఉన్న మహిళను చూస్తే అది కదా పార్టీ బలం అనిపించింది. పోరాడటం జనసేన మూల లక్షణం. కూటమి కోసం కొన్నిసార్లు సర్దుకుంటాను.. ఇది ఒక పార్టీ గురించి కాదు. ఐదు కోట్ల ప్రజల గురించి కొన్నిసార్లు భరిస్తానని గుర్తించాలి’’ అని పవన్‌కల్యాణ్ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతున్నా.. ఎలాంటి లోటుపాట్లూ లేకుండా భక్తులకు తితిదే అన్ని ఏర్పాట్లూ చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు.