
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడ... దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. CM Revanth Reddy On KTR And YS Jagan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ఆస్తి కోసం సొంత చెల్లెళ్లను ఇంటి నుంచి బయటకు గెంటేశారని పేర్లను ప్రస్తావించకుండా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యల చేశారు. తన రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లోని ఆస్తి వివాదాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని రాజకీయ పరిణామాలు కుటుంబాలు, ఆస్తి పంపకాల చుట్టూనే తిరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. "సొంత చెల్లి కూడా భారమైందనుకుని, ఆస్తిలో వాటా అడుగుతుందనే భయంతో ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఆస్తి కోసం సొంత సోదరిని పంపించేస్తే.. ఆ తర్వాత అన్నపై ఆమె శాపనార్థాలు పెట్టే పరిస్థితులు నేటి రాజకీయాల్లో కనిపిస్తున్నాయి" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేరు చెప్పకపోయినా గురి ఎవరికో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా నేరుగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు కానీ ప్రస్తావించలేదు. అయినప్పటికీ, గత కొంతకాలంగా వైఎస్ జగన్-షర్మిల మధ్య, అలాగే కేటీఆర్-కవితల మధ్య (ఆస్తి వివాదాలపై వస్తున్న వార్తల నేపథ్యంలో) నడుస్తున్న అంతర్గత పరిణామాలను దృష్టిలో ఉంచుకునే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత, కుటుంబ బలహీనతలను టార్గెట్ చేస్తూ రేవంత్ వేసిన ఈ పొలిటికల్ పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వేదికపై ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు, మంత్రుల హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబులు సీఎం పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నేరుగా ఆస్తి వివాదాలు, చెల్లెళ్ల ప్రస్తావన తీసుకురావడంతో.. పక్కనే ఉన్న మంత్రులు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో అని అక్కడున్న వారు ఎంతో ఆసక్తిగా చూశారు. Also Read: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్..రేషన్ కార్డులను రద్దు చేస్తున్న ప్రభుత్వం..ఎందుకంటే? Also Read: ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్త.. రాబోయే 3 గంటల్లో పిడుగులతో అల్లకల్లోలంగా వాతావరణం! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook