
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రతినిధి బృందం సీఎంతో సమావేశ... ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రతినిధి బృందం సీఎంతో సమావేశమైంది. జులై 31 నుంచి ఆగస్టు 2వరకు మేరీలాండ్ బాల్టిమోర్‌లో నిర్వహించనున్న అసోసియేషన్ 19వ తెలుగు మహాసభలకు హాజరు కావాలని సీఎంకు ఆహ్వనం అందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కో-ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజినల్ కో-ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.