
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ... సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish Rao Letter: కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంటే రేవంత్ రెడ్డి వ్యాట్‌ను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మాటలు దంచుడు కాదు రేవంత్ దమ్ముంటే ధరలు దించు అని సవాల్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్నుల భారం వెంటనే తగ్గించాలని కోరారు. పెరిగిన ఏడున్నర రూపాయల్లో రెండున్నర స్టేట్ వ్యాట్ ఉందని దానిని తగ్గించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో కూల్ కూల్ వెదర్.. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం 'రూ.115 పెట్రోల్ ధరలో 35 శాతం స్టేట్ వ్యాట్, రూ.103 డీజిల్ ధరలో 27శాతం స్టేట్ వ్యాట్ ఉంది. ప్రజలపై నెలకు రూ. 162 కోట్లు, ఏటా రెండు వేల కోట్ల పన్నుల భారం పడుతోంది. మీది ప్రజా పాలన కాదు, పన్నుల దండుకునే ప్రజా పీడన పాలన. ఎన్నికల ముందు అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇప్పుడు స్టేట్ వ్యాట్ తగ్గించి ప్రజలకు మేలు చేయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు లేఖ రాశారు. Also Read: YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంటే చోద్యం చూడటం ఆపి వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి.. ప్రజలకు ఉపశమనం కలిగించాలని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో రాష్ట్ర పన్నులు తగ్గించాలని గతంలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని లేదని నిలదీశారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు, దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలని డిమాండ్ చేశారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు వారంలో నాలుగు సార్లు ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే.. రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజల నడ్డి విరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతుంటే.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు రైతుల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా రంగం తీవ్ర సంక్షోభానికి లోను కావడంతో ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వర్గాల ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 'పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, పన్నుల భారంతో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు పొలం దున్నాలన్నా డీజిల్ భారం… సామాన్యుడు బైక్ తీయాలన్నా పెట్రోల్ భారం…ఆటో సోదరుడి బతుకు బండి నడవాలన్నా ఇంధన భారం.. పెరిగిన ధరలు ప్రజానీకానికి పెను శాపంగా మారింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు' అని తెలిపారు. పైశాచిక ఆనందం 'పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ రేవంతు ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఖజానా నింపుకుంటూ సంబుర పడుతుంది. పైశాచిక ఆనందం పొందుతుంది. పెరిగిన ధరలతో ప్రతి నెలా రూ.162 కోట్లు, ఏడాదికి దాదాపు 2,000 కోట్ల అదనపు వ్యాట్ ఆదాయం వస్తుంట ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విడిచి పెట్టి ప్రచారాలకే పెద్ద పీట వేస్తున్నది' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు వ్యాట్‌పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, రెండున్నరేళ్లుగా కేనీసం 0.1 శాతం వ్యాట్ కూడా తగ్గించకపోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే పెట్రోల్, డీజిల్‌పై కనీసం 10 శాతం వ్యాట్ తగ్గించి.. పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ పెంపుపై మొసలి కన్నీరు కార్చే రాహుల్