
Home » Andhra Pradesh » MP Kalishetti Appalanaidu Slams YS Jagan Over Faction Politics and Corruption Allegations ABN , Publish Date - May 26 , 2026 | 05:50 AM ఫ్యాక్షన్ సంస్కృతి, రాజకీయాలు చేసేది వైఎస్ జగన్ మాత్రమే... ఫ్యాక్షన్ సంస్కృతి, రాజకీయాలు చేసేది వైఎస్ జగన్ మాత్రమేనని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. న్యూఢిల్లీ, మే 25(ఆంధ్రజ్యోతి): ఫ్యాక్షన్ సంస్కృతి, రాజకీయాలు చేసేది వైఎస్ జగన్ మాత్రమేనని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం జగన్ అని ఎద్దేవా చేశారు. నాడు రాజారెడ్డి వేసిన రక్త పునాదులపై జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారని చెప్పారు. సోమవారం ఎంపీ కలిశెట్టి మీడియాతో మాట్లాడుతూ... జగన్ కుటుంబం మొత్తం అరాచక కోటలపై, అమాయకుల శవాలపైనే నిర్మితం అయ్యిందని ఆరోపించారు. జగన్ నేరాల పుట్టను ప్రపంచానికి చాటి చెబుతామన్నారు. జగన్ చేసిన నేరాల గురించి అన్ని రాష్ర్టాల్లో తెలిపే కార్యక్రమన్ని చేపడతామని చెప్పారు.