
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ... సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Prof Nageshwar Row: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో చర్చించిన అంశాలపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. 'అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి? వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని అడిగితే నాకు క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకి వెళ్తే పవన్ కల్యాణ్ ఎదుగుతారా.? జనసేన ఎదుగుతుందా..?' అని పవన్ కల్యాణ్ ఎదురు ప్రశ్నించారు. ఇలాంటి వారు లేనప్పుడే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. Also Read: Harish Rao: పెట్రోల్, డీజిల్‌పై రేవంత్ రెడ్డి వ్యాట్ తగ్గించాలి.. హరీశ్ రావు లేఖ రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. 'అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చా. ఇలా నన్ను విమర్శించేవాళ్లు రాగలరా? మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నా' అని పవన్ కల్యాణ్ సవాల్ చేశారు. ఛాయిస్ మీకే ఇస్తున్నా అంతేగానీ తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. 'వైసీపీ నాయకుడు (వైఎస్ జగన్) జైలుకు వెళితే పవన్ రాజకీయాల్లోకి ప్రవేశంపై వారి పిచ్చి లాజిక్ అర్థం కావడం లేదు' అని పవన కల్యాణ్ తెలిపారు. 'చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఇదే సరైన సమయం నేను ముఖ్యమంత్రి కావొచ్చని నేను అనుకోవచ్చు కదా? అలా అనుకుంటే అయిపోతామా అలా జరిగిపోతుందా?' అని ప్రశ్నించారు. తన విలువల సిద్ధాంతం అది కాదనేది గ్రహించాలని చెప్పారు. జైలుకు వెళ్తే తాను ఎదగనని.. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతానని స్పష్టం చేశారు. 'సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. మేము కూడా ఎదురుదాడి చేస్తామని గుర్తుంచుకోవాలి' అని కొన్ని సోషల్ మీడియా, కొందరు ప్రముఖులకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. Also Read: YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు టీడీపీతో జనసేన పార్టీకి ఏర్పడిన విబేధాలపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక కుటుంబం నడవాలంటే సర్దుకుంటూ వెళ్లాలని.. కూటమి మధ్య విభేదాలను చూసీచూడకుండా వెళ్లాలని జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ కావాలని.. అలా అయితే కూటమిలో బలం రాదని గుర్తించాలని నాయకులకు సూచించారు. పార్టీ శ్రేణులపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. 'నాయకులకు పదవులు ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తారనుకుంటే మాట్లాడడం మానేశరు. పదవులు ఇవ్వగానే అందరూ పెద్ద మనుషులు అయ్యారు. పదవుల కోసమే అయితే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు' అని పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. కూటమి కోసం కొన్నిసార్లు తాను సర్దుకుంటామని.. ఇది ఐదు కోట్ల ప్రజల గురించి కొన్నిసార్లు భరిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. సమావేశానికి ముందు పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించారు. గోదావరి నది పరిశుభ్రత, పరిరక్షణపై సమీక్ష చేశారు. గోదావరి పుష్కరఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. పుష్కరఘాట్ వద్ద ఏర్పాట్లు, ఫొటో ప్రదర్శన చూసి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్కరఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణం చేశారు. గోదావరి నదిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు ఆదేశించారు. నల్లకాలువ వద్ద చెత్తశుద్ది ప్లాంటును బాగు చేయాలని చెప్పారు.