
పెద్ది సినిమాలో నేను పోషించిన గౌర్నాయుడు పాత్ర చాలా ఆనందానిచ్చింది. Home » Tollywood » peddi movie shiva rajkumar about gournayudu role ram charan national award srk ABN , Publish Date - May 26 , 2026 | 06:30 AM పెద్ది’ (Peddi) సినిమాలో నేను పోషించిన గౌర్నాయుడు పాత్ర చాలా ఆనందాన్చింది. ఈ సినిమాతో రామ్‌చరణ్ జాతీయ అవార్డు వస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ‘పెద్ది’ (Peddi) సినిమాలో నేను పోషించిన గౌర్నాయుడు పాత్ర చాలా ఆనందాన్చింది. ఈ సినిమాతో రామ్‌చరణ్ జాతీయ అవార్డు వస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar). రామ్‌చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రంలో గౌర్నాయుడు అనే కీలక పాత్రను పోషించిన శివరాజ్ కుమార్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. గౌర్నాయుడు పాత్రకు ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ పాత్రను దర్శకుడు బుచ్చిబాబు చాలా అద్భుతంగా ఆవిష్కంచారు. ఇది కోచ్ పాత్రలానే ఉంటుంది. పెద్ది జర్నీ చాలా అద్భుతంగా సాగుతుంది. ఆ ప్రయాణంలో ఎన్నో పాత్రలు వస్తాయి. పెద్ది-గౌర్నాయుడు మధ్య ఉండే అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాన్ని తెరపై చూడాల్సిందే. మా ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత, ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది రామ్‌చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఫెర్మార్మెన్స్ అద్భుతంగా ఉంటాయి. చాలా కష్టపడి, ఏకాగ్రతతో ఈ పాత్ర చేశారు. ఆయన అద్భుతమైన నటుడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ పాత్ర కోసం ఎంతో అంకిత భావంతో పనిచేశారు. ఈ చిత్రంలో ఉండే క్రీడలు ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉంటాయి. ఆ అంశాన్ని ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై ఎంతో ఎంజాయ్ చేస్తారు. జగపతిబాబు గారి పాత్రతో పాటు మిగతా అన్ని పాత్రలనూ డైరెక్టర్ ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. అలాగే డీఓపీ రత్నవేలు తీసిన సన్నివేశాలు ప్రేక్షకులను మైమరపిస్తాయి. ప్రస్తుతం ‘గుమ్మడి నరసయ్య’, ‘జైలర్ 2’ చిత్రాలు చేస్తున్నాను. మంచి కథలు వస్తే తప్పకుండా తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అంటు ముగించారు.